శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 29, 2020 , 01:26:03

రోడ్డు భద్రత నియమాలను పాటించాలి

రోడ్డు భద్రత నియమాలను పాటించాలి


వనపర్తి టౌన్‌: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్ర త నియమాలను పాటించాలని డీఎస్పీ కిరణ్‌కుమార్‌ అన్నారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2వరకు జరుగనున్న రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా మంగళవారం ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన మహిళలు స్కూటీలతో హెల్మెట్‌లు ధరించి ర్యాలీని ఉత్సహంగా చేపట్టారు. ఈ ర్యాలీకి 120 మంది మహిళలు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది హెల్మెట్‌లతో స్కూటీలతో ర్యాలీ నిర్వహించారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌ నుంచి కొత్తకోట రోడ్డు, కొత్త బస్టాండ్‌, రాజీవ్‌ చౌరస్తా, అం బేద్కర్‌ చౌరస్తా, గాంధీ చౌక్‌ మీదుగా మర్రికుంట వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ని త్యం రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపడంతో ప్ర మాదాలు జరుగుతున్నాయన్నారు. ఎంతోమంది హెల్మెట్‌లు వినియోగించుకోకుండా తలకు గాయాలైన తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించి పోలీస్‌ వా రికి సహకరించాలని కోరారు. డ్రైవింగ్‌లో సెల్‌పోన్‌ వినియోగం, ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాద ని, డ్రైవర్‌ పక్కన ఎవ్వరిని ఎక్కించుకోకూడదని, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన వారు మాత్రమే వాహనాలు నడపాలని, ప్ర యాణంలో విదిగా సీటు బెల్ట్‌ ధరించాలని సూచించారు. వారం రోజుల పాటు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రదాన కూడళ్లలో వాహానాల తనిఖీలు చేపడతామని చెప్పారు. ఈ ర్యాలీలో ప్రధాన కూడళ్ల వద్ద ప్రయాణికులకు అవగాహన కల్పించారు. వనపర్తి ప్రజలందరూ భద్రత నియమాలు పాటించి పోలీస్‌ వారికి సహకరించాలని, పోలీస్‌ వా రు విదించే జరిమానాలకు బలికావొద్దని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐ సూర్యనాయక్‌, ఎస్సైలు వెంకటేష్‌గౌడ్‌, షఫీ, ట్రాఫిక్‌ ఎస్సై కోటేశ్వర్‌రావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మంజుల, మహిళ కానిస్టేబుల్స్‌, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

పెబ్బేరులో..

పెబ్బేరు: ప్రతి ఒక్కరూ రోడు భద్రత ని యమాలను పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని మోటార్‌ వెహికిల్‌ ఇన్స్‌స్పెక్టర్‌ సతీశ్‌ కుమా ర్‌ సూచించారు. 31వ జా తీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో రోడ్డు భద్రత నియమాలపై విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటించడంతో ప్రమాదాలను నివారించొచ్చన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రతి క్షణం, ప్రతి నిమిషం అవసరమని, దానిని నిర్లక్ష్యం చేయరాదన్నా రు. ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చైతన్యపర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై ప్రయాణం చేసే వారు వి ధిగా తప్పనిసరిగా సీట్‌ బెల్ట్‌, హెల్మెట్‌ ధరించాలని సూచించారు.  కార్యక్రమంలో  ఎం ఈవో జయరాములు, ఎస్సై రాఘవేందర్‌ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.


logo