మంగళవారం 07 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 29, 2020 , 01:21:37

మంత్రి కేటీఆర్‌ను కలిసిన చైర్‌పర్సన్లు

మంత్రి కేటీఆర్‌ను కలిసిన చైర్‌పర్సన్లు

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ/కొత్తకోట : మున్సిపాలిటీల్లో నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్లు, వైస్‌చైర్‌పర్సన్లు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. మంగళవారం మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రై తు సమన్వయ సమితి జిల్లా సభ్యురాలు చిట్టెం సుచరితరెడ్డిల సమక్షంలో హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌ లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆత్మకూరు చైర్‌పర్సన్‌ గాయిత్రియాదవ్‌, వైస్‌చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, అమరచింత చైర్‌పర్సన్‌ మంగమ్మగౌడ్‌లు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్‌ అం దరికీ అభినందనలు తెలుపుతూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఆత్మకూరు మండలాధ్యక్షుడు రవికుమార్‌ యాదవ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ నాగభూషణంగౌడ్‌ ఉన్నారు.

ఎమ్మెల్యే ఆల ఆధ్వర్యంలో..

కొత్తకోట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుకేశినివిశ్వేశ్వర్‌, వై స్‌ చైర్‌పర్సన్‌ బీసం జయమ్మలు మంగళవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌లను తెలంగాణ భవన్‌లో కలిశారు. దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్‌, కొత్తకోట మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే ఆలను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 


logo