బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 28, 2020 , 04:49:51

నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

వనపర్తి, నమస్తే తెలంగాణ : 2019 ఏప్రిల్‌ నెలలో పాత పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో అప్పటి నుంచి నేటి వరకు కలెక్టర్‌ శ్వేతామొహంతి జిల్లా మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి పాలనలో కార్యక్రమాలను నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియ సమయంలోనే 5వ వార్డు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 32 వార్డులకు ఈనెల 22వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికలకు నిర్వహించి ఈ నెల 25న ఫలితాలను విడుదల చేశారు. అందులో భాగంగానే సోమవారం నూతనంగా ప్రజలచే ఎన్నికైన వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక కార్యక్రమాన్ని ప్రిసైడింగ్‌ అధికారి గణేశ్‌ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ అధికారులు నిర్వహించారు. ఉదయం 11 గంటల వరకు నూతన కౌన్సిలర్లందరు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నారు. మొదటగా నూతన వార్డు కౌన్సిలర్‌లుగా ఎంపికైనా అలివేల, అలేఖ్య, సునిత, కదిరె జంపన్న, కాగితాల లక్ష్మీనారాయణ, బండారు కృష్ణయ్య, గట్టుయాదవ్‌, చంద్రకళ, జయసుధ, నక్క రాములు యాదవ్‌, విభూతి నారాయణ, ఉన్నీసా బేగం, పద్మమ్మ, పాకనాటి కృష్ణయ్య, బ్రహ్మచారి, నాగన్నయాదవ్‌, వెంకటేశ్వర్లు, బాష్యనాయక్‌, బొడ్డుపల్లి పద్మ, బండారు రాధాకృష్ణ, భారతి, నందిమల్ల భువనేశ్వరి, సమద్‌పాష, పుట్టపాకుల మహేశ్‌, మంజుల, రమాదేవి, రాఘవేందర్‌ (కంచె రవి), లక్ష్మి, లక్ష్మిదేవి, వాకిటిశ్రీధర్‌, మేఘావత్‌ శాంతి, చీర్ల సత్యనారాయణ సాగర్‌, సత్యమ్మలు ప్రతిజ్ఞ ప్రతాన్ని అధికారి సమక్షంలో చదివి వినిపించి సంతకాలు చేశారు. అనంతరం 12:30గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌కు ఎలాంటి పోటీ లేకపోవడంతో వనపర్తి మున్సిపాలిటీ చైర్మన్‌గా గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌గా వాకిటి శ్రీధర్‌ను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకోవడంతో అధికారులు సంబంధించిన పత్రాలను అందజేసి ప్రకటించారు. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు ప్రతిజ్ఞ పత్రాన్ని సభ్యులందరికీ చదివి వినిపించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని ప్రిపైడింగ్‌ అధికారి గణేశ్‌, మున్సిపాలిటీ కమిషనర్‌ రజినీకాంత్‌ రెడ్డితో పాటు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఆయా పార్టీల నాయకులు నూతన పాలకవర్గాన్ని శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. logo