సోమవారం 30 మార్చి 2020
Wanaparthy - Jan 28, 2020 , 04:48:37

పురపాలికలు పటిష్టంగా పనిచేయాలి

పురపాలికలు పటిష్టంగా పనిచేయాలి

పెబ్బేరు : రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి స్థానిక సంస్థలై న పురపాలికలు పటిష్టంగా పనిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరు పురపాలిక కార్యాలయంలో జరిగిన చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికల్లో భాగంగా ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా పాల్గొన్నారు. ఎన్నిక అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని రోజులుగా ఉత్కంఠ భరితంగా కొనసాగిన పురఎన్నిక చివరి ఘట్టం పూర్తి అయ్యిందన్నారు. అన్ని పురపాలికల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన సభ్యులే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయారని తెలిపారు. ప్రజలు విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించిన సభ్యులు రాజకీయాలకతీతంగా పని చేయాలని సూచించారు. ఇక నుంచి పురపాలిక అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నా రు. పురపాలికలో ప్రజల మౌలిక వసతులు, అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పురపాలిక సంపూర్ణంగా అభివృద్ధి చెందేలా తన వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎద్దుల కరుణశ్రీ, మేకల కర్రెస్వామి, కౌన్సిలర్లు అక్కమ్మ, చిన్న ఎల్లారెడ్డి, రామకృష్ణ, పద్మ, సుమతి, సాయినాథ్‌ తదితరులున్నారు.

టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకు మంత్రి అభినందనలు

వనపర్తి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పో టీ చేసి విజయం సాధించి కౌన్సిలర్లుగా ప్రమాణం స్వీకారం చేసిన సభ్యులను మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తన నివాసగృహంలో అభినందించారు. నూతనంగా ఎంపికైనా టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయం నుంచి మంత్రి నివాసగృహం వరకు ర్యాలీగా వెళ్లారు. వనపర్తి నూతన చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌లను శాలువా, పూలమాలలతో మంత్రి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎంత  నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారో అంత నమ్మకంతో వారి సమస్యలను పరిష్కరిస్తూ, వార్డులను అభివృద్ధి చేసి చూపించడంతో పాటు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. కార్యక్రమం లో అలివేల, అలేఖ్య, జంపన్న, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, చంద్రకళ,  రాములు యాదవ్‌, నారాయణ, ఉన్నీసా బేగం, పద్మమ్మ, కృష్ణయ్య, నాగన్న యాదవ్‌,  భాష్యనాయక్‌, భారతి, భువనేశ్వరి, సమద్‌పాష, మహేశ్‌, మంజుల,  రాఘవేందర్‌ (కంచె రవి), లక్ష్మిదేవి, శాంతి, సత్యనారాయణ సాగర్‌, సత్యమ్మ, నాయకులు ఉన్నారు. 


logo