బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 28, 2020 , 04:45:39

ప్రజావాణికి 40 ఫిర్యాదులు

ప్రజావాణికి 40 ఫిర్యాదులు

వనపర్తి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 40 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్‌ శ్వేతామొహంతి తెలిపారు. సోమవారం ఆమె తన ఛాంబర్లో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో కలెక్టర్‌ నేరుగా మాట్లాడి తన పరిధిలో ఉన్న వాటిని తక్షణమే పరిష్కరించి, మిగ తా వాటిని ఆయా శాఖల అధికారులకు రెఫర్‌ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని, ఆ దిశగా అడుగులేయాలన్నారు. వ్యవసాయ బోరుబావులు, స్వయం ఉపాధి పథకాలు, భూ సంబంధ కేసులు, కల్యాణలక్ష్మి, వికలాంగుల పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు తదితర వాటి గురించివచ్చే అర్జిదారుల విన్నపాలు క్షుణంగా పరిశీలించి ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్‌, డిప్యూటీ కలెక్టర్‌ వెంకటయ్య, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

ఎస్పీ ప్రజావాణికి ఏడు ఫిర్యాదులు

వనపర్తి టౌన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్‌ ప్రజావాణికి ఏడు ఫిర్యాదులు అందాయని ఏఎస్పీ షాకీర్‌హుస్సేన్‌ తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాలలోని ప్రాంతాల నుంచి తమకు న్యాయం చేయాలంటు పోలీసులను ఆశ్రయిస్తారని సత్వరమే న్యాయం చేయాలని కిందిస్థాయి సిబ్బందికి సూచించారు. మొత్తం ఏడు ఫిర్యాదులు రాగా అందులో మూడు భూ ఫిర్యాదులు, రెండు భార్య భర్తల ఫిర్యాదులు, రెండు పరస్పర గొడవల ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు.


logo