మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Jan 28, 2020 , 04:43:29

విద్యుత్‌ బకాయిలను చెల్లించాలి

విద్యుత్‌ బకాయిలను చెల్లించాలి

వనపర్తి, నమస్తే తెలంగాణ : నవంబర్‌, డిసెంబర్‌ 2019 నెలలకు సంబంధించిన గ్రామ పంచాయతీ విద్యుత్‌ బిల్లులను ఏడు రోజులలోపు చెల్లించాలని కలెక్టర్‌ శ్వేతామొహంతి ఆదేశించారు. సోమవారం ఆమె వనపర్తిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల డీపీవో, పీవో, ఎంపీడీవో, ఎంపీవోలతో వివిధ అంశాలపై టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని చెప్పారు. గ్రామాలలో పనులు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్‌ ఫండ్‌తో పాటు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్నాయని, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా నిధులు ఉన్నాయని తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీలలో విద్యుత్‌ బకాయిలు ఉన్నట్లయితే వెంటనే చెల్లించాలని, ఈ విషయాన్ని ప్రతి రోజు డీపీవోకు నివేదిక పంపాలని ఆదేశించారు. వనపర్తి జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకు గాను 208 గ్రామ పంచాయతీల విద్యుత్‌ బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు. గద్వాల జిల్లాకు సంబంధించి పెండింగ్‌ ఎక్కువగా ఉందని అందువల్ల దీనిపై దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించిన గ్రామ పంచాయతీ విద్యుత్‌ బిల్లులు రానున్న 7 రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాల చెల్లంపు విషయమై కలెక్టర్‌ సమీక్ష చేస్తూ సిబ్బందికి ప్రతి నెల రూ.8500 చెల్లించడం జరుగుతుందని గ్రామ పంచాయతీలోనైనా సిబ్బందికి జీతాలు చెల్లించక పోతే సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల వారిగా నాటే మొక్కల అంచనా, పెంచుతున్న మొక్కలు, మట్టితో బ్యాగులు నింపటం తదితర వివరాలపై ఎంపీడీవోలు తక్షణమే సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. తెలంగాణకు హరితహారం సీజన్లో ఎంపీడీవో, ఎంపీవోలు, ఎట్టి పరిస్థితుల్లో అనాధికారికంగా విధులకు గైహాజరు కావద్దని లేనట్లయితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.


logo
>>>>>>