గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 28, 2020 , 04:39:21

నేటి నుంచి ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు

నేటి నుంచి ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు

వనపర్తి విద్యావిభాగం : జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి సింహయ్య తెలిపారు. సోమవారం ఇంటర్‌ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈనెల 28, 30వ తేదీన ప్రత్యేక పరీక్షలు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పర్యావరణ విద్య, ఎథిక్స్‌, మానవ విలువల పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంటల వరకు ఎథిక్స్‌, మానవ విలువలపై పరీక్ష నిర్వహించబడునని పేర్కొన్నారు. ఈనెల 30న పర్యావరణ విద్య ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ మోడల్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలో ఉంటుందన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించబడుతాయని పేర్కొన్నారు. సమావేశంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ ప్రకాశ్‌, షాకీర్‌హుస్సేన్‌, మద్దిలేటి ఉన్నారు.


logo