గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 27, 2020 , 03:51:40

నేడు చైర్మన్ల ఎన్నిక

నేడు చైర్మన్ల ఎన్నిక

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ చివరిదశకు చేరుకున్నది.. నామినేషన్లు, ఉపసంహరణలు, ప్రచారాలు, పోలింగ్‌, కౌంటింగ్‌ దశలను అధిగమిస్తూ చివరగా మిగిలిన చైర్మన్ల ఎన్నికను సోమవారం నిర్వహించనున్నారు.. ఈ మేరకు జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింతలలో అధికారులు ఏర్పాట్లు చేశారు.. జనవరి 8వ తేదీ నుంచి ప్రారంభమైన మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియకు నేటి చైర్మన్ల ఎంపికతో ముగింపు పలకనున్నది.. నాలుగు బల్దియాల్లో టీఆర్‌ఎస్‌కు సరైన మెజార్టీ వార్డులున్నందున చైర్మన్‌ ఎన్నిక లాంఛనమే కాగా, అమరచింత చైర్మన్‌ గిరి టీఆర్‌ఎస్‌కే వరించే అవకాశం ఉన్నది..

  • నాలుగు బల్దియాల్లో ఎన్నిక లాంఛనమే
  • అమరచింతలోనూ గులాబీకే అవకాశం
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • 11 గంటలకు కొత్త సభ్యుల ప్రమాణం
  • 12:30కు చైర్మన్‌ ఎన్నిక

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ని ఐదు మున్సిపాలిటీల్లో నేడు చైర్మన్ల ఎన్నిక జరగనున్నది. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరులలో చైర్మన్ల ఎన్నిక లాంఛనమే కానున్నది. ఈ నాలుగింటిలో అధిక వార్డు స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. వనపర్తిలో 33 వార్డులకు గా ను  21+4(టీఆర్‌ఎస్‌ రెబల్స్‌) వార్డులు, పెబ్బేరు లో 12 వార్డులకు 7, కొత్తకోటలో 15కు 10, ఆ త్మకూరులో 10 వార్డులకు ఆరింటిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. అమరచింతలోనూ 10 వార్డులకు మూడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థు లు గెలుపొందగా, మిగిలిన కాంగ్రెస్‌, బీజేపీ, టీడీ పీ, సీపీఐ, స్వంతంత్రులకు ఒక్కొక్క స్థానాన్ని ఓ టర్లు కట్టబెట్టారు. సీపీఎంకు రెండు స్థానాలను ఇ వ్వడంతో అమరచింతలో ఏ పార్టీకి సరైన బలం రాలేదు. సీపీఎం సభ్యుల తోడ్పాటుతో గులాబీ పార్టీనే పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు. 


ఐదుగురు ప్రత్యేక అధికారులు..

కొత్తగా ఎన్నికైన మున్సిపల్‌ కౌన్సిలర్లతో ప్ర మాణ స్వీకారోత్సవానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందుకు గాను ఐ దు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు. ఆయా కార్యాలయాల్లోనే ప్రత్యేకంగా ఎన్నిక కోసం ఇబ్బందులు రాకుండా చూ స్తున్నారు. స్థానికంగా ఉండే మున్సిపల్‌ కమిషనర్‌లతోపాటు ప్రత్యేక అధికారుల సమక్షంలో కొత్త వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక పూర్తి చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్త వార్డు సభ్యుల ప్రమాణం, 12:30 కు చైర్మన్‌ ఎన్నికలను చేతులెత్తే పద్ధతిలో ప్రత్యేక అధికారులు నిర్వహించనున్నారు. వనపర్తి బల్దియాకు జే గణేశ్‌ (డీఆర్‌డీవో), కొత్తకోటకు యుగంధర్‌ (అసిస్టెంట్‌ హైడ్రాలజిస్ట్‌), పెబ్బేరుకు బాబ్జీరావు (డీఎఫ్‌వో), ఆత్మకూరుకు విజయభాస్కర్‌ రెడ్డి (డీఎస్‌హెచ్‌వో), అమరచింతకు సుధారర్‌ రెడ్డి (డీఏవో)లను ప్రత్యేక అధికారులుగా ని యమించారు.


logo
>>>>>>