మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Jan 27, 2020 , 03:48:39

అలరించిన నృత్య ప్రదర్శన

అలరించిన నృత్య ప్రదర్శన

వనపర్తి సాంస్కృతికం : జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో అధికారికంగా ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లాలోని ఆయా పాఠశాలల విద్యార్థులు వివిధ రకాల వేషలతో మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలను చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను జేసీ వేణుగోపాల్‌, ఏఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌లు తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మర్రికుంట ట్రైబల్‌ వేలఫర్‌ పాఠశాల విద్యార్థులు భారత సంస్కృతి అనే పాటకు నృత్యం చేశారు. జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు వందేమాతరం, భారతమాత అందుకో వందనం అనే పాటకి అధికారులు ఆకట్టుకునే విధంగా నృత్యం చేశారు. 


అదేవిధంగా జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల వనపర్తి విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలతో సమానం అనే అంశంపై డ్రామ, రైతు భద్రత, రైతు స్థితిగతులపై, డ్రగ్స్‌ వల్ల జరిగే నష్టాల గురించి క్లుప్తంగా నృత్యంతో వివరించారు. వనపర్తి ప్రాథమిక బాలికల పాఠశాల విద్యార్థినిలు తెలంగాణ ఘణ చరిత్ర అంశాలపై డప్పు కొడుతూ డ్యాన్స్‌ చేశారు. శ్రీరంగాపురం కేజీబీవీ విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయల పట్ల నృత్యాలు చేసి మైదానంలో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కేత్తెపల్లికి చెందిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు భారత దేశానికి సైనికులు అవసరం, లాభాలు అని డ్యాన్స్‌ ద్వారా కళ్లకు కట్టినట్టు డ్యాన్స్‌ చేశారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo
>>>>>>