ఆదివారం 24 మే 2020
Wanaparthy - Jan 26, 2020 , 05:31:17

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
 • - ముస్తాబైన పాలిటెక్నిక్‌ కళాశాల మైదానం
 • - స్వాతంత్ర సమరయోధులకు సన్మానాలు
 • -ఉత్తమ అధికారులకు అవార్డుల ప్రదానం
 • - సందేశమివ్వనున్న కలెక్టర్‌ శ్వేతామొహం కార్యక్రమ వివరాలు ఇలా..
 • - ఉదయం 7:55 గంటలకు జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఆగమనం
 • -ఉదయం 7:59 గంటలకు కలెక్టర్‌, జిల్లా మెజిస్ట్రేట్‌ ఆగమనం
 • -ఉదయం 8 గంటలకు కలెక్టర్‌చే జాతీయ పతాక ఆవిష్కరణ, వందన స్వీకారం
 • - ఉదయం 8:02 గంటలకు పోలీస్‌ కవాతు
 • -ఉదయం 8:15 గంటలకు కలెక్టర్‌ సందేశము
 • - ఉదయం 8:45 గంటలకు స్వాతంత్ర సమరయోధుల పరిచయ కార్యక్రమం
 • -ఉదయం 9 గంటలకు విద్యార్థులచే సాంస్కృత్రిక ప్రదర్శనలు
 • - ఉదయం 10 గంటలకు ప్రశంసా పత్రాల ప్రదానం
 • -ఉదయం 10:45 గంటలకు స్టా


వనపర్తి, నమస్తే తెలంగాణ : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానం అంగరంగ వైభవంగా అధికారులు శనివారం సిద్ధం చేశారు. వేడుకలను తిలకించడానికి జిల్లా కేంద్రంలోని ప్రజలతో పాటు నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. వేదికకు కుడి వైపున, ఎడమ వైపున గ్యాలరీలను ఏర్పాటు చేసి అందులో స్వాతంత్ర సమరయోధులను వివిధ రాజకీయ పార్టీల  నాయకులు, ప్రేస్‌ గ్యాలరీతో పాటు ప్రజలు తిలకించేందుకు ఏర్పాటు చేశారు.

కలెక్టర్‌ శ్వేతామొహంతి జాతీయ జెండా ఆవిష్కరణ..

పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో ముందుగా కలెక్టర్‌ శ్వేతామొహంతి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డితో కలిసి నిర్వహిస్తారు. అనంతరం కలెక్టర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తారు. అంతకుముందు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, కలెక్టర్‌ శ్వేతామొహంతి, ఎస్పీ అపూర్వరావు కలిసి పోలీసుల జీపులో ప్రదర్శన, గౌరవ వందనాన్ని స్వీకరించడానికి మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులకు మంత్రి నిరంజన్‌ రెడ్డితో కలిసి శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు నృత్య ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆయా శాఖల జిల్లా విద్యాధికారి కార్యాయంలో నమోదు చేసుకున్నారు.

వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

- జేసీ వేణుగోపాల్‌
ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జేసీ వేణుగోపాల్‌ తెలిపారు. శనివారం ఆయన గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో జిల్లా అధికారులతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఎలాంటి లోటు లేకుండా నిర్వహించాలని కోరారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కలెక్టర్‌ శ్వేతామొహంతి జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. సాంప్రదాయ బద్దంగా పోలీస్‌ కవాతు, విద్యార్థుల సాంస్కృత్రిక ప్రదర్శనలు, ప్రశంసాపత్రాలు ప్రదానం ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో గణేశ్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ దేశీయ నాయుడు, డీపీఆర్‌వో వెంకటేశ్వర్లు, డీఈవో సుశీంధర్‌రావు, వ్యవసాయ పశుసంవర్ధక శాఖ అధికారులు సుధాకర్‌ రెడ్డి, వెంకటేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో పలు స్టాల్స్‌ ఏర్పాటు..
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్‌ను ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ప్రధానంగా వైద్య ఆరోగ్యశాఖ, బీసీ సంక్షేమ శాఖ, అటవిశాఖ వంటి శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.logo