బుధవారం 01 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 25, 2020 , 00:48:50

మిషన్ భగీరథ భేష్

మిషన్ భగీరథ భేష్
  • -శుద్ధి జలాలను అందించడం అభినందనీయం
  • -ఎన్ని గ్రామాలకు తాగునీరందుతున్నది..?
  • -డీఈతో వివరాల సేకరణ
  • -గౌరిదేపల్లి నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన నాబార్డు అధికారులు
రేవల్లి : రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీటి సరఫరా చేసేందుకు ప్రవేశపెట్టిన మిషన్‌భగీరథ పథకం భేష్ అని నాబార్డ్ అధికారు లు తెలిపారు. శుక్రవారం సా యంత్రం వివిధ రాష్ర్టాలకు చెందిన 26 మంది నా బార్డు చీఫ్ జనర ల్ మేనేజర్ల బృం దం మండలంలో ని గౌరిదేపల్లి గ్రా మంలో నిర్మించి న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రా న్ని పరిశీలించా రు. కోడేరు మం డలంలోని మొదటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించాల్సి ఉం డగా సమయాభావం కారణంగా గౌరిదేపల్లిలోని నీటి శుద్ధి కేంద్రాన్ని ఎంచుకుని పరిశీలించారు. కృష్ణానది నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసే విధానాన్ని, నిత్యం 77 ఎంఎల్‌టీల (7కోట్ల70లక్షల లీటర్ల) సామర్థ్యం ఉ న్న నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. నీటి శుద్ధి విధానాన్ని, ఇక్కడినుంచి ఎన్ని గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరందుతుందని డీఈ సురేశ్‌నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ ఇక్కడినుంచి నాగర్‌కర్నూల్, అచ్చంపేటలతో పాటు 410 ఆవాసాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. రేవల్లి మండలంలోని నాగపూర్, శానాయిప ల్లి, గౌరిదేపల్లి గ్రామాలకు కూడా శుద్ధి జలాలను అందిస్తున్నట్లు వివరించారు. అనంతరం సరఫరా విధానాన్ని వారికి వివరించారు. పనులు జరిగిన తీరు, పథకం అ మలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన తాగునీరందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మి షన్ భగీరథ ఈఈలు వెంకట్‌రెడ్డి, సుధాకర్‌సింగ్, పద్మలత, డీఈ సురేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.logo
>>>>>>