బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 25, 2020 , 00:46:47

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
  • -జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్వనపర్తి, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియం, భవనంలో ఏర్పాటు చేసిన వనపర్తి మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని, అలాగే పెబ్బేర్ మార్కెట్ గోదాంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపునకు అన్ని మున్సిపాలిటీలలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఐదు మున్సిపాలిటీ కలిపి 79 టేబుళ్లు, 294 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపునకు వినియోగించడం జరుగుతుందని, ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు సహాయకులు ఉంటారని, వీరితో పాటు రిజర్వ్ స్టాఫ్ అంతేకాక రిటర్నింగ్ అధికారులు, మైక్రో అజర్వర్లు ఉంటారని ఆయన వెల్లడించారు. మున్సిపాలిటీ వారిగా వివరాలను జేసీ తెలియజేస్తూ వనపర్తి మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవం కాగా 32 వార్డులకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియం, భవనంలో మూడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు గాను 33 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 120 మంది సిబ్బంది సేవలను ఓట్ల లెక్కింపునకు వినియోగించుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కొత్తకోట మున్సిపాలిటీకి సంబంధించి 15 వార్డులకు గాను కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, 15 టేబుళ్లు , 57 మంది సిబ్బందిని, అమరచింత మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వ బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, 10 వార్డులకు గాను 10 టేబుళ్లు, 36 మంది సిబ్బంది, ఆత్మకూర్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆత్మకూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10 వార్డులకు గాను 10 టేబుళ్లు, 37 మంది సిబ్బంది, పెబ్బేర్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఏర్పాటు చేయగా 12 వార్డులకు 12 టేబుళ్లు 44 మంది సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని, ఓట్ల లెక్కింపునకు నియమించబడిన అధికారులు, సిబ్బంది అందరు సకాలంలో హాజరై ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన కోరారు.logo