మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Jan 25, 2020 , 00:45:48

ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ఠమైన బందోబస్తు

ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ఠమైన బందోబస్తు
ఎస్పీ అపూర్వరావు

వనపర్తి టౌన్ : వనపర్తి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలలో ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ఠమైన బందోబస్త్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో కొత్తకోట, పెబ్బేర్, ఆత్మకూర్, అమరచింత, వనపర్తి ఐదు మున్సిపాలిటీలలో శనివారం కౌంటింగ్ ఉంటుందని వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో, పెబ్బేర్ మార్కెట్‌యార్డు కేంద్రంలో, కొత్తకోటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆత్మకూర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, అమరచింతలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశామని, పోలీస్ సూచనల ప్రకారం పార్కింగ్ ప్రదేశంలోనే వాహనాలు నిలపాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఐదు పట్టణాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లు, ఎన్నికల ఏజెంట్లు, పోటీ చేసిన కౌన్సిలర్లు పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు తీసుకుని వెళ్లకూడదని, గుంపులుగుంపులుగా ఉండరాదని, పార్టీల జెండాలు, గుర్తుల ప్లేకార్డులు ధరించి ప్రదర్శనలు చేయరాదని, మైక్‌లు, లౌడ్ స్పీకర్లు, పాటలు, ఉపన్యాసాలు ఇవ్వరాదని, విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, పటాకులు కాల్చడం లాంటివి నిర్వహిస్తే అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసుల సూచనలు పాటించి ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేలా సహకరించాలని ఆమె సూచించారు.logo
>>>>>>