శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 22, 2020 , 04:42:20

నేడే పుర పోలింగ్

నేడే పుర పోలింగ్


వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు 160 కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత పట్టణాల్లోని 80 వార్డులకు గాను ఒక్క వార్డు ఏకగ్రీవమైంది. దీంతో 79 వార్డు స్థానాలకు 342 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. ఇక్కడ పోలింగ్ సరళిని వెబ్ ద్వారా రికార్డు చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 700 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో నిమగ్నమవుతారు. ఐదు మున్సిపాలిటీలను  19 రూట్లుగా విభజించి 19 మంది జోనల్, 12 మంది నోడల్ అధికారులను నియమించారు. ఎన్నికలు జరిగే పట్టణాల్లోని     పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

జిల్లా లో బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నిక ల పోలింగ్ అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు మంగళవారం సా యంత్రం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి ఆయా మున్సిపాలిటీల కు పోలింగ్ బాక్సులు, ఎన్నికల సిబ్బందిని కే టాయించి ప్రత్యేక వాహనాల్లో పంపించారు. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత బల్దియాల్లో మొత్తం 80 వార్డులుంటే, ఒక్క వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 79 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, 342 మంది అభ్యర్థులు తమ ఎన్నికల భవిష్యత్ తేల్చుకోబోతున్నారు. ఉదయం 7 నుంచి సాయం త్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నది.

సమస్యాత్మక కేంద్రాల్లో చర్యలు..

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలోని 22 అతి సమస్యాత్మక కేంద్రాలున్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటిలో ప్రత్యేక నిఘా ఉంచారు. మొత్తం 79 పోలింగ్ కేంద్రాల్లో అతి సమస్యాత్మకంగా 22, సమస్యాత్మకంగా మరో  51 కేంద్రాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని వెబ్ ద్వారా పర్యవేక్షణ జరపనున్నారు. కేంద్రం నిర్వహణ తీరును జిల్లా, రాష్ట్ర స్థాయిలో కా ర్యాలయాల ద్వారా పరిశీలన చేసేలా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ప్రతి పోలింగ్ కేంద్రం పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు అనువుగా వెబ్ జియో ట్యాగింగ్ చేశారు.

700 మంది పోలీసులు..

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 700 మంది పోలీసులను నియమించారు. ఎస్పీ, ఏ ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్ ఏఎస్ హెడ్ హోంగార్డులు, ప్రత్యే క పోలీసులు, ఐదు ప్రత్యేక స్క్వాడ్స్ బృం దాలు సైతం ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎక్క డా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నా రు. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీల వారీగా నియామకం చేసిన పోలీసులు ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ఎక్కడైనా ఘర్షణలు, ఇత ర సమస్య ఉత్పన్నమైతే, 08545-233331 నెంబర్ ఫోన్ ద్వారా తెలియపరిచేలా పోలీస్ శాఖ సిద్ధం చేసింది. ఇదిలా ఉండగా, జిల్లాలో ఐదు బల్దియాల్లో 19 మంది జోనల్ అధికారులు, 12 మంది నోడల్ అధికారులు, 195 మంది పీవోలు, 195 మంది ఏపీవోలు, 486 మంది ఓపీవోలు మొత్తం 1463 మంది ఎన్నికల సిబ్బందిని కేటాయించారు.

ఐదు చోట్ల కౌంటింగ్..

ఎన్నికలు జరుగుతున్న ఆయా కేంద్రాల వా రీగానే కౌంటింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం బ్యాలె ట్ బాక్సుల భద్రతకు స్ట్రాంగ్ రూంలను ఏర్పా టు చేశారు. వనపర్తి కౌంటింగ్ పాలిటెక్నిక్ కళాశాల, పెబ్బేరు కౌంటింగ్ మార్కెట్ యా ర్డు గోదాం, కొత్తకోటకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆత్మకూరుకు ప్రభుత్వ జూనియర్ క ళాశాల, అమరచింతకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. బుధవారం పో లింగ్ ముగిసిన అనంతరం ఈ నెల 25న కౌం టింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.

అన్ని ఏర్పాట్లు చేశాం..

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. పీవో, ఏపీవో, ఓపీవోలను కేటాయించి ఎలాంటి సమస్య లేకుండా పోలింగ్ నిర్వహిస్తాం. ప్రతి కేంద్రంలోనూ వెబ్ ఏర్పాటు చేశాం. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోని ప్రతి కేంద్రంలోనూ వెబ్ వసతిని ఏర్పాటు చేశాం. పోలింగ్ అనంతరం ఆయా కేంద్రాల్లోనే బ్యాలెట్ బాక్సులను భద్రపరిచి అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తాం.
- శ్వేతామొహంతి, కలెక్టర్

స్వేచ్ఛగా ఓటేయండి..

ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. ఐదు మున్సిపాలిటీల్లో ప్రశాంత పోలింగ్ ఏర్పాట్లు చేశాం. సమస్యాత్మక కేంద్రాలను ముందే గుర్తించి తగిన బందోబస్తును నిర్వహిస్తున్నాం. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రజలు పోలీసులకు సహకరించాలి. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేలా చర్యలు తీసుకున్నాం. ఆయా కేంద్రాల వారీగానే ఇందుకు తగిన ఏర్పాట్లు చేశాం.             
- అపూర్వరావు, ఎస్పీlogo