గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 22, 2020 , 04:41:51

టీఆర్ ఆదరించండి

టీఆర్ ఆదరించండివనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మంత్రి నిరంజన్ టీఆర్ ఆదరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓటర్లు ఆదరణ ఇస్తే అభివృద్ధికి చేటుగా నిలుస్తుందన్నారు. నేడు తెలంగాణలో దేశంలోనే ఆదర్శ పాలన కొనసాగుతుందని, ఇక్కడి సంక్షేమ పథకాలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇంత వరకు ఏ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. గతంలో విద్యుత్తుకు, తాగునీటికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో ప్రజలు మరిచి పోవద్దని మంత్రి గుర్తుచేశారు.

తాగునీటితో పాటు సాగునీటిని కూడా రాష్ట్రంలో విరివిగా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని చెరువులను కృష్ణానది నీటితో సస్యశ్యామలం చేస్తున్నామని, వనపర్తిలో సమీపంలో ఉన్న పెద్ద చెరువులన్ని నిండుకుండలను తలపిస్తున్నాయన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదిముబారక్, కేసీఆర్ లాంటి పథకాలతో సామాన్యులకు టీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. పార్టీలకతీతంగా ప్రభుత్వం పథకాలు అందిస్తున్నదని, ప్రభుత్వ పథకాల అమలులో దళారి వ్యవస్థకు సర్కార్ చెక్ పెట్టిందన్నారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేస్తున్న టీఆర్ పార్టీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి సింగిరెడ్డి కోరారు.logo
>>>>>>