శనివారం 28 మార్చి 2020
Wanaparthy - Jan 22, 2020 , 04:40:19

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి : ఏఎస్పీ

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి : ఏఎస్పీ


ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : ఎన్నికల విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఏఎస్పీ షాకీ ర్ హుస్సేన్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ ఎ న్నికల విధులకు హజరయ్యే పో లీసు సిబ్బందితో సమావేశమై బం దోబస్తుపై సూచనలు చేశారు. ప్రతి అంశంలోనూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. గడువు ముగింపు పై సొంత నిర్ణయం తీసుకోకుండా ఎన్నికల అధికారుల సూచనలు పాటించాలన్నారు. స్వతహాగా గేట్లు మూసేసి అబాసుపాలు కావొద్దని సూచించారు. పోలింగ్ కేంద్రంలో విధులు ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి సంఘటనలు చో టుచేసుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగనీయకుం డా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొంత సమయం ఆలస్యమైనప్పటికీ ఒరిగేదేమీ లేదని, శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని అన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత బందోబస్తుగా బ్యాలెట్ బాక్స్ నిర్వహణ కేంద్రానికి చేర్చాలన్నారు.

గుర్తింపు కార్డు, ఓటరు స్లిప్ లేదని ఓటర్లను వెనక్కి పంపించకూడదన్నారు. ఓటరు లిస్ట్ పేరు ఉండి ఉంటే ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటరు తన ఓటును వినియోగించుకోవచ్చన్నారు. అమరచింతలో అడిషనల్ ఎస్పీ, ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్ లు, ఐదుగురు ఏఎస్ 35 మంది కానిస్టేబుళ్లు, ఆత్మకూరులో ఒక డీఎస్పీ, ఒక సీఐ, ఇద్దరు ఎస్ ఐదుగురు హె డ్ కానిస్టేబుళ్లు, 8 మంది కానిస్టేబుళ్లు, 50 మంది హోంగా ర్డ్స్ విధులు నిర్వర్తిస్తున్నట్లు సీఐ సీతయ్య తెలిపారు. కార్యక్రమాల్లో ఆత్మకూరు ఎస్ ముత్తయ్య, అమరచింత ఎస్ ఆం జనేయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


logo