శనివారం 28 మార్చి 2020
Wanaparthy - Jan 21, 2020 , 01:54:41

హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి : కలెక్టర్‌

హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి : కలెక్టర్‌


వనపర్తి, నమస్తే తెలంగాణ : పోలింగ్‌ సందర్భంగా ఓటర్లకు సహకరించేందుకు గా ను హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని క లెక్టర్‌, ఎన్నికల అధికారి శ్వేతామొహంతి సూచించారు. సోమవారం తన ఛాంబర్లో మున్సిపల్‌ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు స్నేహ సమక్షంలో పోలింగ్‌ సిబ్బం ది ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల్లో వికలాంగ ఓటర్లకు మూడు చ క్రాల బండ్లు ఏర్పాటు చేయాలని, వలంటీర్లను నియమించాలన్నారు. పోలింగ్‌ విధులకు నియమించిన సిబ్బంది 21వ తేదీన స కాలంలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో హాజరై ఎన్నికల సామగ్రిని తీసుకువెళ్లేలా చూడాల ని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల్లో అవసరమైన బ్యానర్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 24వ తేదీన మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. సమావేశం లో జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌, మాన్‌ఫర్‌ మేనేజ్‌మెంట్‌ నో డల్‌ అధికారి మధుకర్‌, ఈ-జిల్లా మేనేజర్‌ వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఓటర్లకు అనుమతి ఇవ్వాలి

మున్సిపాలిటీల్లో నివసిస్తూ ఇతర ప్రాం తాల్లో పనిచేస్తున్న వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పబ్లిక్‌ అండర్‌ టేకిం గ్‌, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు పోలింగ్‌ సమయంలో మూడు గంటలు సమయం అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ ప్రకటన ద్వారా సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు అందాయన్నారు.


logo