గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 20, 2020 , 04:41:29

టీఆర్‌ఎస్‌దే విజయం

టీఆర్‌ఎస్‌దే విజయం
  • -అభివృద్ధి నా బాధ్యత
  • -కారు గుర్తుకు ఓటేయడం మీ బాధ్యత
  • -ఆరేండ్ల పాలనలో వనపర్తికి సాగునీళ్లు
  • -విపక్షాలకు ఓటేస్తే అభివృద్ధి మరుగున పడుతుంది
  • -వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • -వనపర్తి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం
  • -కొత్తకోటలో ఎంపీ బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యే ఆల, వాల్యానాయక్‌ ప్రచారాలు

ఈ నెల 22వ తేదీన జరగనున్న బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.. ఆదివారం వనపర్తి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కారుగుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి.. అభివృద్ధి చేసే బాధ్యత తనది అని అన్నారు.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.. రాజనగరం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వివరించారు.. అలాగే కొత్తకోట మున్సిపాలిటీలో ఎంపీ బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సెక్రటరీ వాల్యానాయక్‌లు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తకోటను ఆదర్శ మున్సిపాలిటీగా చేస్తామని హామీ ఇచ్చారు..             - వనపర్తి, నమస్తే తెలంగాణ/కొత్తకోట

వనపర్తి, నమస్తే తెలంగాణ : వనపర్తి పట్టణా న్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం తన పూర్తి బాధ్యత అని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించ డం మీ బాధ్యత అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ము న్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి బల్దియాలోని రాజనగరం, నాగవరం, నాగవరం తండా, కేడీఆర్‌ నగర్‌, హనుమాన్‌టేకిడి, మార్కెట్‌ యా ర్డ్‌, రాంనగర్‌, బసవన్నగడ్డ, భగీరథకాలని, సాయి నగర్‌ కాలని, సాగర్‌కాలని, పీర్లగుట్ట, జంగాల గు ట్టలతో పాటు 11,12, 13వ వార్డుల్లో మంత్రి ని రంజన్‌ రెడ్డి అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించడంతో పాటు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రజ లు గెలిపించి ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చె ప్పడం ఖాయమన్నారు. 60 ఏండ్లు అధికారం ఇ స్తే వనపర్తిని పట్టించుకున్న పాపాన పో లేదని, కేవలం ఆరేండ్ల కాలంలోనే వనపర్తికి సాగునీళ్లు తీసుకువచ్చామని, నల్లచెరువును కృష్ణాజలాలతో అలుగు పారించామని గుర్తు చేశారు. సాగునీళ్లు, సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతు న్న సీఎం కేసీఆర్‌ పాలనలోని అధికార పార్టీకి ఓటే స్తే మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుందని, విపక్షాలకు ఓటేస్తే అభివృద్ధి మరుగున పడుతుందన్నారు. ప్రతి పథకంలో దళారీ వ్యవస్థను దగ్గర కు రానీయకుండా, నేరుగా లబ్ధిదారులకు చేరేలా అమలు చేస్తున్నామన్నారు. గత పాలకుల హ యాంలో అమ్మచెరువుకు మురుగు నీళ్లు పం పారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కృ ష్ణాజలాలను తీసుకువచ్చి అలుగు పారించామన్నారు. రాజనగరం చెరువులో మురుగు నీరు కలవకుండా నీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మురుగునీటితో పండిన పంటల వల్ల అనారోగ్యాలకు గురవుతారని, భవిష్యత్‌ తరానికి ఆ పరిస్థితి రాకుండా చెరువును శుద్ధి చేసుకుని మంచి నీటితో పంటలను పండించి ఆరోగ్యాలను కాపాడుకుందామన్నారు. రాజనగరం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చి ఆహ్లాదకరమైన వా తావరణాన్ని అందించడానికి ప్రణాళికలను రూ పొందిస్తున్నట్లు వివరించారు. వచ్చే జాతర నాటికి జాతర దుకాణాలను చెరువు కట్టపై పెట్టేలా ఏర్పా ట్లు చేస్తామని, దక్షిణ భారతదేశంలో ఒక్క రాజనగరంలోనే రామకృష్ణేశ్వరస్వామి దేవాలయం ఉం దని చెప్పారు. వనపర్తి పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన రోడ్ల విస్తరణ పనులు ప్రారంభమయ్యామని, అందులో భాగంగానే నాగవరం రో డ్డు విస్తరణ పనులు మొదలయ్యాయన్నారు. ఇం డ్లు కోల్పోతున్న బాధితుల కోసం డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. అలాగే పట్టణంలోని పేదలకు అవసరమైన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని, భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని వనపర్తి అభివృద్ధి విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌ గుర్తు అయిన కారు గుర్తుకు ఓటేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు నందిమల్ల మధుమాల సుభాశ్‌, పుట్టపాకుల మహేశ్‌, జహంగీర్‌ తదితరులు ఉన్నారు.


టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించండి..

కొత్తకోట : టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తామని ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) బండ ప్రకాశ్‌,  ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తకోటలోని 3,7,8,9,12 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సె క్రటరీ వాల్యానాయక్‌లతో కలిసి ఇంటింటి ప్ర చారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధిలో భా గస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకుందామన్నారు. కొత్తకోటను ఆదర్శ మున్సిపాలిటీగా చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ది ప్రజల ప్రభుత్వమని, సీఎం కేసీఆర్‌ అన్ని వ ర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాడని గుర్తుచేశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. కొత్తకోట మున్సిపల్‌ ఎజెండాను ప్రజలకు వివరించారు. పాదయాత్రగా కొనసాగిన ఇంటింటి ప్రచారం గులాబీమయంగా మారిం ది. కార్యకర్తలు పాదయాత్రలో జోరును ప్రదర్శి స్తూ జై కేసీఆర్‌, జై టీఆర్‌ఎస్‌ అనే నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మ న్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంతమౌనిక, మాజీ జెడ్పీటీసీలు విశ్వేశ్వర్‌, పీజే బాబు, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి సుకేశినివిశ్వేశ్వర్‌, సీడీసీ చైర్మన్‌ జ గన్‌మోహన్‌రెడ్డి, లతీఫ్‌, సుభాష్‌, భీంరెడ్డి, వెంకట్‌నారాయణ, శ్రీనూజీ, మోహన్‌కుమార్‌, రా ధారామకృష్ణారెడ్డి, బాలకృష్ణ, వసీంఖాన్‌,  యా దయ్యసాగర్‌, హనుమంతుయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు ఉన్నారు.logo