గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 20, 2020 , 04:34:15

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
  • -కట్టుదిట్టమైన భద్రత
  • -నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
  • -వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్‌
  • -రాజకీయ నాయకులు, గ్రామస్తులతో సమావేశం


పెబ్బేరు : మున్సిపాలిటీ ఎన్నికలు, చౌడేశ్వరీ జాతర ఉత్సవాలు, రిపబ్లిక్‌ దినోత్స వ వేడుకలను ప్రశాంత వా తావరణంలో నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎస్పీ కిరణ్‌కుమార్‌ కోరారు. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివిధ రాజకీ య పార్టీల నాయకులు, గ్రామ పెద్దలతో ఎస్సై రాఘవేందర్‌ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పురఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాత ర ఉత్సవాల్లో రోడ్డుకిరువైపులా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా వాహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమం లో సీఐ మల్లికార్జున రెడ్డి, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
logo
>>>>>>