మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Jan 19, 2020 , 01:05:20

నిండు జీవితానికి..రెండు చుక్కలు

నిండు జీవితానికి..రెండు చుక్కలు
  • - ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • - 52 వేల మంది చిన్నారుల గుర్తింపు
  • - జిల్లా వ్యాప్తంగా 400 బూత్‌లు
  • - ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పంపిణీ

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పోలియో రహిత సమాజమే లక్ష్యంగా 0-5 ఏళ్లలోపు ఉన్న చిన్నారులకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 14 మండలాల వారీగా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 52,016మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 400 బూత్‌లను ఏర్పాటు చేశారు. అలాగే 40 రూట్లుగా గుర్తించి పల్స్‌ పోలియో కార్యక్రమ నిర్వహణకు శ్రీకారం చుడుతున్నారు. జిల్లాలో మరో 12 సెంటర్లను ప్రజల రద్దీగా ఉండే ప్రాంతాలుగా గుర్తించి పల్స్‌ పోలియో నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలియో మందుల పంపిణీ సాయంత్రం 5 గంటల వరకు ఎంపిక చేసిన కేంద్రాల్లో  కొనసాగుతుంది. మొదటి రోజు పోలియో అనంతరం రెండు, మూడు రోజుల్లో ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో పోలియో డ్రాప్స్‌ వేయించుకోని చిన్నారులకు అక్కడే పోలీయో చుక్కలను వేసేలా సిబ్బంది చర్యలు తీసుకున్నారు.

ప్రతి చిన్నారికి చుక్కలు వేయించండి

పోలియో రహిత సమాజం కోసం ఐదేళ్ల చిన్నారులకు తప్పనిసరిగా రెండు చుక్కల మందును వేయించాలి. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయోద్దు. ప్రతి ఏటా రెండు పర్యాయాలు చుక్కల మందు వేయించాలి. 2012 లో నే పోలియో రహిత దేశంగా గుర్తించబడింది. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ చర్యలను తీసుకుంటున్నది.
- డాక్టర్‌ శ్రీనివాసులు, జిల్లా వైద్యాధికారి, వనపరిlogo
>>>>>>