సోమవారం 30 మార్చి 2020
Wanaparthy - Jan 19, 2020 , 01:03:57

జిల్లాలో 160 పోలింగ్‌ కేంద్రాలు

జిల్లాలో 160 పోలింగ్‌ కేంద్రాలు


వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని ఐ దు మున్సిపాలిటీల్లో ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేసిన ట్లు కలెక్టర్‌ శ్వేతామొహంతి చెప్పారు. ఓటర్లు ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు కార్డులను తప్పనిసరిగా కేంద్రాల్లో చూయించాలని వెల్లడించారు. శనివా రం మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడా రు. మొత్తం 80 వార్డులకు గగానను ఒక్క వార్డు ఏకగ్రీ వం కాగా, 79 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చె ప్పారు. ఈనెల 22వ తేదీన జరుగనున్న ఎన్నికలకు 160 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలతో పాటు మరికొన్ని చోట్ల మార్పులు చేశామని, వీటిని ఓటర్లు గమనించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 16 మంది జో నల్‌ అధికారులను నియమించామని, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఏర్పాట్లు చేశామనారు.

పోలింగ్‌ కేంద్రాలన్నీ ఆన్‌లైన్‌ చేస్తామని చెప్పారు. కాగా, స్ట్రాంగ్‌ రూమ్స్‌, కౌంటింగ్‌కు సంబంధించిన చర్యలను పూర్తి చేసినట్లు వెల్లడించారు. విడుతల వారీగా పీవో, ఏపీవో లు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ అప్లికేషన్స్‌ను అందుబాటులో ఉంచామని, ఆన్‌లైన్‌లో కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవచ్చన్నా రు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటేసేందుకు ఎన్నికల సం ఘం అనుమతించిన 18 ధ్రువపత్రాలతో ఏదో ఒక దా నిని రుజువుగా చూపించి ఓటేయాల ని తెలిపారు. ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌లైసెన్స్‌, రాష్ట్ర, కేంద్ర ప్రభు త్వ సంస్థలు, స్థానిక సంస్థలు, పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టే కింగ్‌ సంస్థలు వారి ఉద్యోగులకు జారీ చేసిన ఫొటో గు ర్తింపు కార్డు, బ్యాంకులు, పోస్టాఫీస్‌లు జారీ చేసిన ఫొ టో పాస్‌బుక్‌లు, పాన్‌కార్డు, ఎన్‌పీఆర్‌ పథకం కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు, ఫొటో ఉన్న పింఛన్‌ డాక్యుమెంట్‌, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన గుర్తింపు కార్డు, రేషన్‌కా ర్డు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువపత్రాలు, స్వాతంత్ర సమరయోధుల గుర్తింపు కార్డు, ఆయుధ లైసెన్స్‌, వికలాంగ ధ్రువపత్రం, పట్టాదారు పాసుపుస్తకాలలో ఏదో ఒక దా నిని తీసుకురావాలని పేర్కొన్నారు. సమావేశంలో జేసీ వేణుగోపాల్‌, డీపీఆర్‌వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


logo