బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 18, 2020 , 04:12:58

అభివృద్ధికి నాదీ పూచీ

అభివృద్ధికి నాదీ పూచీ
  • -మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించండి
  • -వనపర్తిని గజ్వేల్‌, సిద్దిపేట సరసన నిలుపుతా
  • -సాగునీటి రాకతో మారిన స్వరూపం
  • -ట్రిపుల్‌ఐటీ మంజూరుకు కృషి
  • -నీతిమాలిన రాజకీయాలకు తెరలేపిన ప్రతిపక్షాలు
  • -ఆశీర్వాద సభలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • -విజయదుందుభి మోగించాలి : ఎంపీ రాములు

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే.. అభివృద్ధిని పరుగులు పెట్టించే పూచీ తనదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని బస్‌డిపో రోడ్డులో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సాగునీటి రాకతో వనపర్తి రూపురేఖలు మారిపోయాయని, 35 మినీలిఫ్ట్‌ల ద్వారా గజ్వేల్‌ కన్నా ముందుగానే సాగునీటిని చూశామన్నారు.. గజ్వేల్‌, సిద్ధిపేట, సిరిసిల్ల మాదిరిగా వనపర్తిని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉందని చెప్పారు.. రోడ్ల విస్తరణ పనులు దశల వారీగా చేస్తున్నామని వివరించారు. 1,100 డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మాణమవుతున్నాయని, అదనంగా మరో 1,500 ఇండ్లను మంజూరు చేయించుకుందామన్నారు. వనపర్తిలో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటుకు ప్రయత్నం జరుగుతున్నదన్నారు. అక్రమంగా, అనైతికంగా జతలు కట్టిన కాంగ్రెస్‌, బీజేపీలకు చెంపపెట్టుగా ఓటర్లు తీర్పునివ్వాలని కోరారు.. టీఆర్‌ఎస్‌ పార్టీ విజయదుందుభి మోగించాలని ఎంపీ రాములు ఆకాంక్షించారు.

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. ము న్సిపల్‌ ఎన్నికల్లో విజయం ద్వారా వనపర్తి అభివృద్ధిని పూర్తిస్థాయిలో చేపట్టే బాధ్యతను స్వయం గా తాను తీసుకుంటానని మంత్రి నిరంజన్‌రెడ్డి ఓటర్లకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో గజ్వే ల్‌, సిద్ధిపేట అభివృద్ధి పనులు జరిగినట్లుగానే వనపర్తిలో చేపట్టి తీరుతామని మంత్రి ఉద్ఘాటించారు. శుక్రవారం వనపర్తి బస్‌డిపో రోడ్డులో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. ఈ సభలో మంత్రి నిరంజన్‌రెడ్డి తో పాటు నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రా ములు, జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగునీటి వసతులు ఏర్పాట్లతో ఇప్పటికే వనపర్తి ప్రాంత స్వరూపం మారుతుందని అన్నారు.

సాగునీటి వనరుల ద్వారా ప్రజల్లో నాగరికత పెరగడం, అలాగే గతంలోకంటే ఆత్మవిశ్వాసం అంచెలంచెలుగా పెరుగుతుందన్నారు. నీళ్ల రాకతో గ్రామీణ ప్రజల ఆదాయ ఒనరులు అభివృద్ధిలోకి వచ్చాయ ని, దీని ద్వారా పట్టణాల్లోని ప్రజల వ్యాపారాలు కూడా పెరుగుతున్నాయని మంత్రి చెప్పారు. అభివృద్ధి పైనే నా దృష్టి ఉందన్నారు. కాలువల ద్వారా సాగునీటి వనరులను సమకూర్చడమే కాకుండా దాదాపు 35 మినీ లిఫ్టులను ఏర్పాటు చేసి వేలాది ఎకరాలకు సాగునీరందించామన్నారు. వనపర్తికి గజ్వేల్‌కన్నా ముందే సాగునీరు తెచ్చుకున్నారని.. మీరు అదృష్టవంతులని స్వయంగా సీఎం కేసీఆరే అభినందించారని మంత్రి గుర్తు చేశారు. రోడ్ల విస్తరణ పట్టణంలో ప్రారంభమైందని, ఇప్పటికే నాగవరం వైపు పనులు వేగంగా జరుగుతున్నాయన్నా రు.

అలాగే 1100 ఇండ్లు నిర్మాణం జరుగుతున్నాయని, వీటితో పాటు అదనంగా మరో 1500 ఇం డ్లను మంజూరు చేయించుకుని నిరుపేదల ఇండ్ల కష్టాలను తొలగిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పటికే వ్యవసాయ మార్కెట్‌ యార్డును పునరుద్ధరించడంలో భాగంగా 40 ఎకరాల్లో రూ.38కోట్లతో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. ప్ర స్తుత మార్కెట్‌ స్థానంలో ఆధునాతన వసతుల కూడిన మార్కెట్‌ (పండ్లు,ఫలాలు,మాంసం తదితర)ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయన్నారు. పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం రూ.4 కోట్లతో ఏకో పార్కు ఏర్పాటు చేశామని, మరో 50 ఎకరాల విస్తీర్ణంలో అటవి పార్కును ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. వనపర్తిలో 20 ఎకరాల స్థలంలో ఆటోనగర్‌ను ఏర్పాటు చేస్తామని, మోటరు వాహనాల పనులపై ఆధారపడ్డ వారందరికీ ఉపాధిని పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. వేరుశనగ ఉత్పత్తిలో వనపర్తి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, ఇందుకు వనపర్తిలో వేరుశనగ పరిశోదన కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. వీటితో పాటు పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి కృషి జరుగుతుందని, దాదాపు రూ.200కోట్లకు సంబంధించిన ఈ పనులు కేంద్రం సహాయంతో చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకు ఎంపీ రాములు సహకారం తీసుకుంటామన్నారు. నల్ల చెరువు, ఈదుల చెరువుకు కృష్ణానీరందిందని, అలాగే తాళ్ల చెరువుకు త్వరలోనే నీరు వస్తుందని మంత్రి చెప్పారు.

వనపర్తిలో త్రిబుల్‌  ఐటీ ఏర్పాటు కోసం ప్రయత్నం జరుగుతుందని, దీనికి సంబంధించిన ఫైలు త్వరలోనే కేబినెట్‌ ముందుకు రాబోతుందన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో వనపర్తికి త్రిబుల్‌ ఐటీని తీసుకవస్తామన్నారు. భవిష్యత్‌లో వనపర్తికి మెడికల్‌ కళాశాల మంజూరు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాగా, పట్టణంలో 32 వార్డులకుగాను 32 వార్డులను గెలిపించి వనపర్తి ప్రత్యేకతను చాటుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. దీనివల్ల ముఖ్యమంత్రి ముందు ఈ విజయాన్ని పెట్టి ఈ ప్రాంతానికి మరిన్ని నిధుల మంజూరుకు ఉపయోగించుకుందామన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీలను గమనించండి..

జాతీయ స్థాయి రాజకీయాల్లో కత్తులు దూసుకుంటున్న కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల పరిస్థితిని ఒక్కసారి ఓటర్లు పరిశీలించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. వనపర్తిలో ఆక్రమంగా, అనైంతికంగా జతలుకట్టిన ఈ రెండు పార్టీలకు మున్సిపల్‌ ఎన్నికల్లో చెంప పెట్టుగా వనపర్తి ఓటర్లు తీర్పునివ్వాలన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలది నీతిబాహ్యమైన కలయికగా మంత్రి అభివర్ణించారు. తెలంగాణ సాధనల ఏనాడు కలిసిరాని కాంగ్రెస్‌, బీజేపీలు అధికారం కోసం ఇక్కడ ఎలా అనైతికంగా వ్యవహరిస్తున్నారో గమనించాలన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా, ఉద్యమం చేపట్టిన పార్టీగా టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందని మంత్రి చెప్పారు. ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాదేనని, సీఎం సహాయనిధి, షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాల చెక్కులను వారి ఇంటికి వెళ్లి స్వయంగా అందజేస్తున్నాని మంత్రి గుర్తు చేశారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోరారు.

విజయదుందుభి మోగించాలి

- ఎంపీ రాములు
మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయదుందుభి మోగించాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలను సమంగా అమలు చేస్తున్నారన్నారు. వనపర్తి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తేవడంలో మంత్రి నిరంజన్‌రెడ్డి గట్టి పునాది వేశారన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడంతోనే గొప్ప మార్పు ప్రారంభమైందని, అనంతరం సాగునీటి వైభోగం మంత్రి చొరవతో నేడు వనపర్తిలో నిండుకుందన్నారు. జరిగిన అభివృద్ధిని.. అలాగే జరగాల్సిన అభివృద్ధిని ఒక్కసారి ఓటర్లు సమీక్షించుకోవాలని ఎంపీ కోరారు. మున్సిపల్‌ ఎన్నికల్లోను ఓటర్లు చేయూతనివ్వడం ద్వారా మరింత బాధ్యత పెరుగుతుందన్నారు.

 

అభివృద్ధికి పునాది పడింది

- జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి
వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి పట్టుదలతో అభివృద్ధికి పునాది పండిందని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాల్సి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా ఇంకా మిగిలిన పనులను వేగంగా సాధించుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ  జిల్లా చైర్మన్‌ బీ లక్ష్మయ్య, గొర్రెల కాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్‌, టీఆర్‌ఎస్‌ యువనాయకుడు రంగినేని అభిలాశ్‌లు పాల్గొనగా, సభకు టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గట్టు యాదవ్‌ అధ్యక్షత వహించారు. రు. కాగా, సభలో వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను మంత్రి ప్రజలకు పరిచయం చేశారు.logo