సోమవారం 06 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 18, 2020 , 04:11:45

పోలీస్‌ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైంది

 పోలీస్‌ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైంది
  • -సాంకేతిక పరిజ్ఞానంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి
  • -టెన్త్‌ బెటాలియన్‌లో శిక్షణ ప్రారంభించిన ఎస్పీ అపూర్వరావు
  • -తొమ్మిది నెలల శిక్షణకు హాజరైన 322 మంది సిటీ ఆర్మీ రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు
  • -పోలీసు శిక్షణను ప్రారంభించిన ఎస్పీ అపూర్వరావు

వనపర్తి టౌన్‌/ఎర్రవల్లి చౌరస్తా: తెలంగాణ పోలీస్‌ శాఖ అన్ని విభాగాలు, అన్ని స్థాయిలలో ఆధునిక మార్పులతో ముందుకు సాగుతున్నదని అందుకు అనుగుణంగా శిక్షణ అభ్యర్థులు అన్ని ఆంశాలు నేర్చుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు అన్నారు. శుక్రవారం ఇటిక్యాల మండలం టెన్త్‌ బెటాలియన్‌ శిక్షణ కేంద్రంలో కొత్తగా ఎంపికైన సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ హైదరాబాద్‌ జిల్లాకు చెందిన 322 మంది అభ్యర్థులకు తొమ్మిది నెలల శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. శిక్షణకు వచ్చిన అభ్యర్థులకు పోలీస్‌ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనదని, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉన్న వారికి మంచి భవిష్యత్‌ ఉంటుందని తెలంగాణ పోలీస్‌ శాఖ వినియోగిస్తున్న మొబైల్‌ అప్లికేషన్లపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటు సేవచేసే అవకాశం పోలీస్‌ ఉద్యోగం ద్వారా లభిస్తుందని అన్నారు. ఇండోర్‌ శిక్షణ ఔట్‌ డోర్‌ శిక్షణలో నేర్పే ఆంశాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలని ముఖ్యంగా భారత శిక్షాస్మృతి, సెక్షన్లు, మానవ హక్కుల గురించి సమగ్ర శిక్షణలో నేర్పించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. శిక్షణలో పాల్గొని తల్లిదండ్రుల కష్టాన్ని, ఉద్యోగం సంపాదించడానికి పడిన కష్టాన్ని గుర్తుంచుకొని అన్ని ఆంశాలు శిక్షణలో నేర్చుకోవాలన్నారు.  స్మార్ట్‌ ఫోన్‌లను శిక్షణ కేంద్రంలో అనుమతించడం జరిగిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టెన్త్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ పీ మోహన్‌, అదనపు కమాండింగ్‌ అధికారి ఆదినారాయణ, ఆర్‌ఐలు శ్రీధర్‌, నరసింహ, రమేష్‌బాబు, రాజేష్‌, ప్రేమ్‌కుమార్‌, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 


logo