గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 18, 2020 , 04:09:59

ప్రజల రక్షణకే

ప్రజల రక్షణకే
  • -మున్సిపల్‌ ఎన్నికలు సజావుగా జరగాలి
  • -అనుమానితులు కనిపిస్తే సమాచారమివ్వండి
  • -డీఎస్పీ కిరణ్‌కుమార్‌
  • -కొత్తకోటలో కార్డన్‌సెర్చ్‌


కొత్తకోట : ప్రజల రక్షణకే కార్డన్‌సెర్చ్‌ను నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కొత్తకోటలో ని దండుగడ్డ కాలనీలో సీఐ మల్లికార్జున్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్‌ నిర్వహించా రు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడు తూ ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు మున్సిపల్‌ ఎన్నికలు సజావుగా సాగేలా కార్డన్‌సెర్చ్‌ నిర్వహించామన్నారు. ప్రజలకు భద్ర త కల్పించడంతో పాటు సమస్యలను నేరుగా తె లుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్క రూ వాహనాల ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు కలిగి ఉండాలని, ఎలాంటి పత్రాలు లేని వాహనాలు నడపరాదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత వాహనాలు కొనేటప్పుడు వాటి డాక్యుమెంట్స్‌ చెక్‌ చేసుకోవాలని, లేకుంటే వాటిని విక్రయించకూడదన్నారు. కాలనీలో ఎవ్వరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే 100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేస్తే వెంటనే చర్యలు చేపడతామన్నారు. ఎ లాంటి ధ్రువపత్రాలు లేని 21 బైక్‌లను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై సతీశ్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo
>>>>>>