శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 17, 2020 , 01:24:35

అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కడతారు

అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కడతారు
  • - మూడు బల్దియాల్లో గులాబీ జెండా ఎగురేస్తాం
  • - మక్తల్‌, ఆత్మకూరు, అమరచింత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
  • - మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిమక్తల్‌ నియోజకవర్గంలోని మూడు బల్దియాలపై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆత్మకూరు, అమరచింత, మక్తల్‌ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే వివరించారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ : మక్తల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఏర్పడ్డ మూడు మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్‌ జెండాను రెప రెపలాడిస్తామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

నమస్తే తెలంగాణ : మక్తల్‌ నియోజకవర్గంలో కొత్తగా మూడు మున్సిపాలటీలను ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటుకు మీరు ఎటువంటి కృషి చేశారు?
ఎమ్మెల్యే చిట్టెం : మెరుగైన పాలనను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతనంగా జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. నియోజకవరగలోని మక్తల్‌, అమరచింత, ఆత్మకూరులను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపాం. రాష్ట్ర మున్సిపాల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మూడింటికి ఆమోదం తెలిపారు. వాటి అభివృద్ధి కోసం నిధులను సైతం మంజూరు చేశారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఒకే సమయంలో మూడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకోవడం పట్ల మీ అభిప్రాయం?
   నియోజకవర్గంలో ఒకేసారి మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు కావడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. భీమా, సంగంబండ రిజర్వాయర్ల ద్వారా సాగునీటి సదుపాయాలను కల్పించుకొని కోనసీమను తలపించేలా పంటలను పండించుకుంటున్నాం. పరిపాలనా సౌలభ్యం కోసం మూడు మున్సిపాలిటీలు మంజూరు కావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ ప్రాంత పరిస్థితులపై అవగాహన ఉన్న మంత్రి కేటీఆర్‌ చలువ వల్లే మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకోగలిగాం.

నూతన మున్సిపాలిటీలలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలలో విజయం సాధించడానికి ఎటువంటి వ్యూహాలను రూపొందించుకున్నారు?
   మూడు మున్సిపాలిటీలకు సంబంధించి ప్రధాన

సమస్యలను గుర్తింంచాం. దశల వారీగా  ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. మున్సిపాలిటీల వారీగా, వార్డుల వారీగా వివరాలను రూపొందించి మ్యానిఫెస్టోను రూపొందించాం. అలాగే వార్డుల వారీగా సర్వేలు చేయించి సమర్థులైన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసి రంగంలోకి దించాం.

ప్రచారంలో ప్రధానంగా ఏఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లబోతున్నారు?

నియోజకవర్గంలో ఆరున్నర ఏండ్లుగా జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు తెలుసు. టీఆర్‌ఎస్‌ అంటే మా పార్టీ.. మా పార్టీ అభ్యర్థులను మేం గెలిపించుకుంటాం.. అన్న సంకల్పంతో ఉన్నారు. ప్రధానంగా సాగునీరు, తాగునీటి వసతులను కల్పించిన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం.

మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఇప్పటికే ఏవైనా ప్రణాళికలు సిద్ధం చేశారా?

   ప్రతి మున్సిపాలిటీలో డ్రైనేజీ, మెరుగైన తాగునీరు, పార్కులు, టౌన్‌హాళ్లను, డంపింగ్‌ యార్డుల ఏర్పాటు, చెట్ల పెంపకం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తాం. మూడు మున్సిపాలిటీలు కృష్ణానదికి సమీపంలో ఉండడం వల్ల పర్యాటక స్థలాలుగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటాం.

గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ తిరుగులేని విజయాలను సాధించింది. ఈ ఎన్నికల లోను ఎన్ని స్థానాలను దక్కించుకోగలరని భావిస్తున్నారు?
   ప్రజలు అభివృద్ధి చేసే పార్టీకి మద్దతు ఇస్తారు. సంవత్సర కాలంగా జరుగుతున్న ఎన్నికలన్నింటిలోనూ రు జువైంది. ఈ ఎన్నికలలో మక్తల్‌లో 16 వార్డులు, అమరచింతలో 10, ఆత్మకూరులో 10 వార్డులలో విజ యం సాధించి టీఆర్‌ఎస్‌ జెండాను రెపరెపలాడిస్తాం.
logo