మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Jan 17, 2020 , 01:22:45

చింతలకుంట అంజన్నకు మాంసాహారమే నైవేద్యం

చింతలకుంట అంజన్నకు మాంసాహారమే నైవేద్యం
  • - మూడు రోజులపాటు జాతర ఉత్సవాలు
  • -పొట్టేళ్లు, కోళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తులు
  • - అంజన్న సన్నిధిలోనే వంటలు చేసుకుని బంధుమిత్రులకు విందు

పెబ్బేరు రూరల్‌ : ఆంజనేయస్వామి స్వతహాగా శాఖాహారి. ఏ ఆలయంలో చూసినా భక్తులు శాఖాహార వంటలే ఆయనకు నైవేద్యంగా పెడుతుంటారు.  కానీ, పెబ్బేరు మండలం పాతపల్లిలోని చింతలకుంట అంజన్నకు మాత్రం మాంసాహార వంటలంటేనే ప్రీతిపాత్రం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు అంజన్న ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పొట్టేళ్లు, కోళ్లను బలి ఇచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. వండిన మాంసం, మద్యం తో స్వామి వారికి నైవేద్యాలు సమర్పించారు. కొత్త వా హనాలకు పూజలు చేయించారు. అ నాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని భక్తులు తూచ తప్పకుండా పాటించారు. మూడు రోజుల్లో సుమారు 20వేల మంది భక్తులు అంజన్నను దర్శించుకున్నా రు. అంజన్న సన్నిధిలోనే వంటలు చేసుకొని బంధుమిత్రులకు విందులిచ్చారు. ఈ సందర్భంగా జాతరలో పలు రకా ల అంగళ్లు వెలిశాయి.logo
>>>>>>