సోమవారం 06 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 15, 2020 , 03:54:06

ప్రతి పల్లె ఆనందంగా ఉండాలి

ప్రతి పల్లె ఆనందంగా ఉండాలి
  • - జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డివనపర్తి రూరల్‌ : తెలంగాణ ప్రభుత్వ పాలనలో ప్రతి పల్లె పచ్చదనంతో ఆనందంగా పండుగ వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కడుకుంట్ల గ్రామంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌కు జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ పథకాలతో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని పేర్కొన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి కృషితో నియోజక వర్గంలోని దాదాపుగా ప్రతి గ్రామంలోని చెరువుకు సాగు నీరందించడంతో గ్రామాలలో ప్రజలకు చెతి నిండ పనులు లభిస్తున్నాయిని అన్నారు. అలాగే రైతులు పంటసాగులో బీజిగా మారిపోయారని, కరెక్టుగా దసరా, సంక్రాంతికి పంటలు చేతికి రావటంతో రైతులు గ్రామాల లో పండుగలను ఘనంగా నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. ఎప్పుడులేని విధం గా ఈ ఏడాది ప్రతి పల్లెలో యువకులు ఉత్సహాంగా పట్టణాల నుంచి తమ సొంత గ్రా మాలకు వచ్చి గ్రామాలలో క్రీడలను నిర్వహించుకొవటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే చిట్యాల గ్రామంలో మాజీ జెడ్పీటీసీ వెంకట్రావ్‌ తల్లిదండ్రుల పుల్లరావు, నారమ్మల స్మారకార్థం క్రీడపోటీలను రెండు రోజులుగా నిర్వహిస్తున్నట్లు సర్పంచ్‌ భానుప్రకాశ్‌రావు తెలిపారు. 15వ తేదీన విజేతలకు బహుమతులను అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా చిమనగుంటపల్లి, అచ్యుతాపురం, పెద్దగూడెం గ్రామాలలో క్రికెట్‌ పోటీలను ఆయా గ్రామాల యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు బాలకృష్ణ, యువకులు, నాయకులు, పాల్గొన్నారు.


logo