బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 15, 2020 , 03:52:34

19న చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి

19న చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి


వనపర్తి, నమస్తే తెలంగాణ : పోలియో కారణంగా చిన్నపిల్లలకు అంగవైకల్యం కలగకుండా ఈనెల 19వ తేదీ నుంచి పోలియో చుక్కలు వేయించాలని జేసీ వేణుగోపాల్‌ కోరారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పల్స్‌ పోలియో, జాతీయ నులిపరుగుల నివారణ దినోత్సవాల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పోలియో వ్యాధి సోకడం వల్ల ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు అంగవైకల్యం కలిగే ప్రమాదం ఉందని అందువల్ల జిల్లాలోని ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పకుండా తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఏదైనా కారణం చేత 19వ తేదీన వేయించని వారికి ఈనెల 20, 21వ తేదీలలో పోలియో బృందాలు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలో 19 సంవత్సరాల లోపు చిన్నారులకు మాత్రలను పంపిణీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాసులు, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ శంకర్‌, ఆర్డీవో చంద్రారెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు.


logo