బుధవారం 01 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 14, 2020 , 02:34:28

పురపోరులో నిలిచేదెవరో..?

 పురపోరులో నిలిచేదెవరో..?
  • - ఉపసంహరణకు నేడే ఆఖరు
  • - మధ్యాహ్నం 3గంటల వరకు గడువు
  • - ముమ్మరంగా ఏకాభిప్రాయాలపై కసరత్తు
  • - ఎంపికైన అభ్యర్థులకు బీఫారాల పంపిణీ
  • - వేడెక్కిన ‘పుర’ రాజకీయం

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం ఆఖరి రోజు కావడంతో ఏకాభిప్రాయాలపై కసరత్తు జోరుగా సాగుతుంది. ఇప్పటికే అనేక వార్డుల్లో ఒకరికి మించి ఉన్న సొంత పోటీదారులను ఒప్పించి ఉపసంహరణల వైపు అడుగులు వేయించారు. ఇంకా మిగిలిన వార్డుల్లోను ఒకే అభ్యర్థిని పోటీ చేయించి సంప్రదింపులను సక్సెస్‌ దిశగా నడిపించే పనుల్లో నేతలు నిమగ్నమయ్యారు. అధికంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఎక్కువ మంది అభ్యర్థులు వార్డులకు పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇతర పార్టీల్లో ఒకటి, రెండు చోట్ల మినహా పెద్దగా పోటీ పడుతున్న సందర్భాలు లేవని చెప్పాలి. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల్లోను టీఆర్‌ఎస్‌ గాలి ఉన్నందునా ఎలాగైనా బీఫాం సంపాధించాలని చివరి వరకు అభ్యర్థులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీటన్నింటిని అర్థం చేసుకున్న నేతలు కూడా వారి అభిప్రాయాలను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకుంటున్నారు. తప్పని పరిస్థితిలో తప్పుకోవాలని, లేదంటే పార్టీ సీరియస్‌గా వ్యవహరిస్తుందని సముదాయిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న వారందరికీ దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్ర టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎక్కడికక్కడ వార్డు సభ్యులను ఎంపిక చేయడంలో ప్రాధాన్యతగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఇప్పటికే అనేక వార్డుల్లో సంప్రదింపులు కొలిక్కి రాగా, మిగిలిన వాటిపైనా బాధ్యులు ఎక్కడిక్కడ ఆ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లో సంప్రదింపుల చర్యలు చివరి దిశకు చేరుకున్నాయి.

నేడు 3 గంటల వరకే..

ఉపసంహరణలకు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకే గడువు ఉంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాలను అధికారులు ప్రకటిస్తారు. నామినేషన్లు వేసిన అనంతరం ఇతర ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి పెట్టిన అధికారులు ఇక ఉపసంహరణల గడువు ముగింపుతో పూర్తిస్థాయి కార్యాచరణను తీసుకోనున్నారు. అభ్యర్థుల ప్రచారాలు, ఆర్బాటాలు, ఇతర వా టిని పరిశీలనకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను ఇ ప్పటికే నియమించింది. మంగళవారం నుంచి ప్రచారాలు కూడా ఊపందుకోనున్నాయి. పార్టీ ప్రకటించే అభ్యర్థులెవరో ఈరోజు మూడు గంటలకు తేలిపోనుండటంతో ఓటర్లు ఆసక్తిగా గమమిస్తున్నారు. కాగా, జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 80 వార్డులకుగాను 555 మంది నామినేషన్లు వేసిన సంగతి విధితమే.
నేడు టీఆర్‌ఎస్‌ బీఫాంల పంపిణీ
మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పార్టీ బీఫాంలను అందించనున్నారు. అలాగే ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లోను ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌ రెడ్డిలు బీఫాంలను పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేయనున్నారు. అయితే, ఇప్పటికే ఆయా వార్డుల్లో ఏకాభిప్రాయం ఉన్న పరిస్థితిని బట్టి కొందరికి బీఫాంలను అందించారు. ఇక మిగిలివాటిని ఒకేసారి మంత్రి, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పోటీదారులు బీఫాంలను అందుకుంటారు. ముమ్మరంగా ఏకాభిప్రాయాలపై దృష్టిపెట్టిన నేతలు వార్డుల వారీగా పరిస్థితిని చక్కబెట్టడంలో సఫలీకృతులవుతున్నారు.


logo
>>>>>>