ఆదివారం 29 మార్చి 2020
Wanaparthy - Jan 14, 2020 , 02:31:55

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
  • - కలెక్టర్‌ శ్వేతామొహంతి

వనపర్తి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ శ్వేతామొహంతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేశారు. పాలిటెక్నిక్‌ కళాశాల ఆడిటోరియంతో పాటు పక్కనే ఉన్న భవనంలో కూడా ఓట్ల లెక్కింపు ఏర్పాటు చేయాలని, పై అంతస్థులో బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి 33 వార్డులు ఉన్నందున అన్ని వార్డుల ఓట్ల లెక్కింపు ఒకే హాల్‌లో చేపట్టవద్దని, 2 హాల్లో ఏర్పాటు చేయాలని, ఇందుకు తగ్గట్టుగా ఏర్పాటు ఉండాలని చెప్పారు. అనంతరం ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి అవసరమైన పోలీస్‌ సిబ్బంది విషయమై కలెక్టర్‌తో చర్చించారు. కలెక్టర్‌ వెంట జేసీ వేణుగోపాల్‌, మున్సిపల్‌ పరిపాలన శాఖ అడిషినల్‌ డైరెక్టర్‌ రవికిరణ్‌, డీఎస్పీ కిరణ్‌, వనపర్తి మున్సిపల్‌ కమిషనర్‌ రజినీకాంత్‌ రెడ్డి, సీఐ సూర్యనాయక్‌, తాసిల్దార్‌ రాజేందర్‌ ఉన్నారు.
నోడల్‌ అధికారులదే బాధ్యత
మున్సిపాలిటీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించే బాధ్యత నోడల్‌ బృందాలపై ఉందని కలెక్టర్‌ శ్వేతామొహంతి అన్నారు. సోమవారం ఆమె జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల నోడల్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆయా అంశాల వారిగా నోడల్‌ అధికారులతో సమీక్షిస్తూ ఎన్నికల విధుల నిర్వహణకు నియమించిన సిబ్బంది అందరు విధులకు హాజరయ్యేలా చూ డాలన్నారు. రెండు జిల్లాలలో అవసరమ్యే బ్యాలె ట్‌ బాక్సులను సిద్ధంగా ఉంచాలని అన్నారు. బ్యా లెట్‌ బాక్స్‌లతో పాటు ఎన్నికల సిబ్బందిని పోలిం గ్‌ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు అదేవిధంగా రిసెప్షన్‌ కేంద్రానికి తీసుకువచ్చేందుకు ఆయా మున్సిపాలిటీల వారిగా అవసరమైన వాహనాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది ఈనెల 17న తేదీ రెండు జిల్లా కేంద్రాలలో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, ఫంక్షన్‌హాల్‌లో కాకుండా పాఠశాల లేదా కళాశాల తరగతి గదుల్లో శిక్షణను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అన్ని మున్సిపాలిటీల వారిగా అవసరమైన పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈనెల 17వ తేదీన కలెక్టర్‌ కార్యాలయంలో సూక్ష్మ పరిశీలకులు, వెబ్‌ కాస్టింగ్‌ సిబ్బందికి కూడా శిక్షణ ఏర్పాటు చేయాలని, ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఎక్సెండిచర్‌ కమిటీలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఖర్చులను సంబంధిత అభ్యర్థుల ఖాతాలలో జమ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్‌, వనపర్తి, గద్వాల జిల్లాల నోడల్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు హాజరయ్యారు.logo