గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 13, 2020 , 04:14:14

సంప్రదింపులు

సంప్రదింపులు
  • - టీఆర్‌ఎస్‌లో ఏకాభిప్రాయానికి కృషి
  • - చొరవ తీసుకుంటున్న మంత్రి సింగిరెడ్డి
  • - అదే బాటలోఎమ్మెల్యేలు ఆల, చిట్టెం
  • - ఇతర పార్టీల్లో పోటీ అంతంతమాత్రమే..
  • - ఫలప్రదమవుతున్న గులాబీ చర్చలు
  • - రేపటి వరకు ఉపసంహరణలకు అవకాశం
వననర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నామినేషన్ల దాఖ లు, పరిశీలన ముగిసింది. ఇక ఉపసంహరణల గడువు మిగిలింది. ఆయా పార్టీల నాయకులంతా సంప్రదింపులపైనే దృష్టి పెట్టారు. మరో రెండు రోజులు గడువున్నందునా ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు వేసిన చోట ఏకాభిప్రాయానికి ప్రయత్నాలు జోరందుకున్నాయి. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అధికంగా పోటీ చేయాలనే ఉత్సాహం అభ్యర్థుల్లో ఉం ది. ఈ పార్టీ నుంచే ఎక్కువ మంది వార్డు సభ్యులుగా పోటీ చేయాలని ఉత్సహపడుతున్నారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 80 వార్డులున్నాయి. వీటిలో జిల్లా మొత్తంగా 555 మంది అభ్యర్థులు నామినేషన్ల పరిశీలన అనంతరం పోటీలో మిగిలారు. అయితే, టీఆర్‌ఎస్‌ నుంచి 204 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరి అనంతరం కాంగ్రెస్‌ నుంచి 125 మంది పోటీలో ఉంటే, 86 మంది స్వతంత్ర అభ్యర్థులు రంగ ంలో ఉన్నారు. ఇక మిగిలిన పార్టీల నుంచి అంతంత మాత్రమే అభ్యర్థులు నామినేషన్లు వేశారు.


టీఆర్‌ఎస్‌లో ఏకాభిప్రాయానికి..

ఎక్కువ పోటీ ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీలో ఏకాభిప్రాయానికి నేతలు దృష్టి పెట్టారు. ఆయా వార్డు స్థాయిలో ఇప్పటికే అక్కడి బాధ్యులు నామినేషన్‌ వేసిన అభ్యర్థు లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒక్కొక్క వార్డు లో ముగ్గురు, నలుగురు వరకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిం చి నామినేషన్లు వేశారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డు స్థాయి బాధ్యుల ద్వారా ఏకాభిప్రాయం కుదరని పక్షంలో పరిస్థితిని ముఖ్యనేతలకు సమాచారం ఇస్తున్నారు. ఇప్పటికే వనపర్తి మున్సిపల్‌ పరిధిలోని 5వ వార్డులో ఎన్నిక లేకుండానే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శాంతి ఏకగ్రీవమైన సంగతి విధితమే. ఇక్కడ నలుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్లు వేయగా, ముగ్గురు అభ్యర్థులను ఉపసంహరణ చేయించడం జరిగింది. అయితే, అంతకు ముందు కాంగ్రెస్‌ అభ్యర్థి వేసిన నామినేషన్‌ వయస్సు రీత్యా తిరష్కరణకు గురికావడం తో ఆ వార్డు ఏకగ్రీవంగానే టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి వెళ్లే లా చేసింది. ఇలా అన్ని వార్డుల్లో ఎక్కువ మంది పోటీ నుంచి నామినేషన్లను ఉపసంహరించేందుకు ఏకాభిప్రాయం తీసుకు వచ్చే పనుల్లో ముఖ్య నాయకులు నిమగ్నమయ్యారు.


చొరవ తీసుకుంటున్న మంత్రి సింగిరెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసే అభ్యర్థుల్లో ఏకాభిప్రాయానికి మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అయితే, నియోజకవర్గంలో వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు మున్సిపాలిటీలలో 45 వార్డుల వరకు ఉన్నాయి. అయితే, వనపర్తి మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ యువనాయకుడు రంగినేని అభిలాశ్‌, పెబ్బేరులో మంత్రి అల్లుడు, టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు వంగూరు ప్రమోద్‌కుమార్‌రెడ్డిలు మంత్రి సూచనల మేరకు పార్టీ అభ్యర్థుల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తున్నారు. వీరి స్థాయిలోను ఏకాభిప్రా యం కుదరని పక్షంలో స్వయంగా మంత్రి ఆయా వా ర్డుల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థులతో మాట్లాడి ఏకాభిప్రాయం తీసుకువస్తున్నారు. ఇప్పటికే అధిక వార్డు ల్లో ఏకాభిప్రాయం దిశగా అడుగులు పడ్డాయి. మిగిలిన వాటిలో అదే మార్గంలో జరుపుతున్న చర్చలన్ని ఫలప్రదమవుతుండటంతో గులాబీశ్రేణులు ఉత్సాహంలో ఉన్నారు. అలాగే కొత్తకోటలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంత మౌనిక, ఆత్మకూరులో ఎంపీపీ శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్‌, అమరచింతలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రాజేందర్‌ సింగ్‌, టీఆర్‌ఎస్‌వీ నాయకుడు నరేశ్‌రెడ్డిలు స్థానిక సమస్యలపైన సమన్వయం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌ రెడ్డిలు పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలపై పట్టు సాధించేందుకు పట్టుదలతో ముందుకు వెళుతున్నారు. పార్టీకి సీనియర్‌గా పని చేస్తున్న వారికి ఎలాంటి నష్టం జరగనివ్వమని మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఇస్తున్న భరోసాతో టీఆర్‌ఎస్‌లో ఏకాభిప్రాయం దిశగా అడుగులు పడుతున్నాయి. 


14వ తేదీ వరకు ఉపసంహరణ గడువు

నామినేషన్లు దాఖలు, పరిశీలన వ్యవహరాలను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఇక వీటి అనంతరం ఉపసంహరణ గడువు వరకు వేచి చూడాల్సిందే. మరో రెండు రోజుల వరకు అభ్యర్థులకు ఉపసంహరణలకు అవకావం ఉంది. జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో ఉపసంహరణల గడువు ముగుస్తుంది. ఆయా పార్టీలోని బాధ్యులు ఎక్కవ మంది పోటీ చేసిన వార్డుల్లో ఏకాభిప్రాయం సాధించే దిశగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గడువులోపు వీరిని ఒప్పించి ఎలాగైనా తప్పించడంతోనే గెలుపునకు మార్గం సుగమమవుతుందనే లక్ష్యంతో ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. అసలుసిసలైన పోటీలో ఎవరెవరు ఉంటారనే అంచనా తేలాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే.


logo
>>>>>>