బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 13, 2020 , 04:13:53

ప్రభుత్వ పథకాలే మన బలం

ప్రభుత్వ పథకాలే మన బలం

మక్తల్‌ టౌన్‌: ప్రజల ఆశీర్వాదంతో అమరచింత మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నా రు. ఆదివారం మక్తల్‌లోని తన నివాసంలో అమరచింత అభ్యర్థులకు ఏబీ ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వ పని తీరే మన కు నిదర్శనమని అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం తమ బలమని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, జరగబోయే అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని అభ్యర్థులకు సూచించారు. అక్కడున్న పార్టీ కార్యకర్తలు సహకరించాలని, అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలు కోరుకునే విధంగా పాలన అందిస్తున్నారని, కేసీఆర్‌ కిట్లు, రైతు బీమా, ఆసరా పింఛన్లు పలు పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ పథకాలే మన పార్టీకి రక్ష అని, అభ్యర్థులు ప్రచారంలో పార్టీ కార్యకర్తలు ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యురాలు సుచరితారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ నరసింహగౌడ్‌, లక్ష్మీ వెంకట్రాములు, రమేశ్‌, రవి, కవిత రాజు, రత్నం, ఎం సునీత, మాదవి, మంగ మ్మ, రాజశేఖర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గుప్త, కావలి శ్రీహ రి, ఈశ్యర్‌ యాదవ్‌, ఆనంద్‌, రాజమహేందర్‌రెడ్డి, నేతాజీ, అమరచింత అభ్యర్థులు పాల్గొన్నారు.


logo