సోమవారం 30 మార్చి 2020
Wanaparthy - Jan 13, 2020 , 04:12:17

అపూర్వ సమ్మేళనం

అపూర్వ సమ్మేళనం


వీపనగండ్ల : ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఉంటెనే విద్యార్థులు ఉన్నత స్థానంలో రాణించగలుతారని మండల విద్యాధికారి లక్ష్మణ్‌ నాయక్‌ అ న్నారు. ఆదివారం మండలంలోని తూంకుంట గ్రా మంలో 1994-95 బ్యాచ్‌ పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా పాఠశాల ఆవరణలో స్వామి వివేకానంద, భరతమాత, సరస్వతీదేవి చిత్ర పటాలకు పూలమాలలు వేశారు. వివేకానందుని జన్మదినాన్ని పురస్కరించుకొని తమ పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటు తమ ప్రాణ స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యా బుద్ధులు నేర్పిన చిన్న నాటి గురువుల సేవలను, మధుర జ్ఞాపకాలను స్మరించుకుంటూ శాలువలతో పాటు మెమొంటోను అందిం చి సత్కరించారు. అమ్మలాంటి బడి నిత్యం వెలుగాలని కోరుతూ పూర్వ విద్యార్థులు సునిల్‌ కుమార్‌రెడ్డి సుమారు రూ.2.5 లక్షలు విలువ చేసే 70 బెంచీలను వితరణ చేయగా, వెంకటేశ్వర్లు రూ.16వేలు విలువ చేసే మైక్‌సెట్‌ వితరణ చేశారు. అలాగే పీ శివనీల శ్రీనివాస్‌లు వంద స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులు వితరణ చేశారు. మండల విద్యాధికారి లక్ష్మణ్‌ నాయక్‌ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో మంచి స్థానంలో స్థిరపడాలం టే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకమైనదన్నారు. సమాజంలో మంచి పౌరుడుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే విద్యతో పాటు నిజాయితీ కలిగియుండాలన్నారు. పూర్వపు ఉపాధ్యాయులు కాంతారెడ్డి, బాలకృష్ణ రాజు, గాలయ్య గౌడ్‌, గాల్‌రెడ్డిలు మాట్లాడుతూ తమ విద్యార్థులు ఎంత స్థానంలో ఎదిగిన తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీనివాస్‌, కృష్ణాప్రసాద్‌, ఈశ్వర్‌రెడ్డి, నాగరాజు, రాంబాబు, సువర్ణ, చంద్రకళ, భాగ్యమ్మ, అలివేళ పాల్గొన్నారు.


పెద్దగూడెంలో..

వనపర్తి రూరల్‌ : మండలంలోని పెద్దగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళ కార్యక్రమాన్ని ఆదివారం 2008-09 పదో తరగతి పూర్వవిద్యార్థులు ఆనాటి ఉపాధ్యాయులను మౌలలీ, రూపేందర్‌, తిరుమలేశ్‌ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కారించారు. అనంతరం పూర్వ ఉపాధ్యాయులను శాలువ, పూలమాలలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కారించారు. ఆనాటి ఉపాధ్యాయులు హరినాథ్‌ సాగర్‌, కురుమన్న, చంద్రశేఖర్‌, లోకభిరాంరెడ్డి,  వేణుగోపాల్‌, లోకమాత, శైలజ, కమల, శారధ, రవి, బంగారు బాబులను సన్మానించారు. 


logo