శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 12, 2020 , 03:54:33

ఓటరు జాబితా సవరణలో తప్పులుండొద్దు

ఓటరు జాబితా సవరణలో తప్పులుండొద్దు
  • -రంగాపురంలో సవరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌


పెబ్బేరు రూరల్‌ : కొత్త ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని తప్పుల్లేకుం డా నిర్వహించాలని కలెక్టర్‌ శ్వేతామొహంతి ఆదేశించారు. ఈనెల 11,12వ తేదీల్లో నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా రంగాపురం హైస్కూల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బీఎల్‌వోలతో మాట్లాడుతూ జనవరి 1, 2020 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తు ఫారాలు, జాబితాలో డబుల్‌ పేర్లు, చనిపోయిన, తొలగించవలసిన పేర్లు, మా ర్పు చేర్పులకు, సవరణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎ లాంటి తప్పుల్లేకుండా సవరణలు చేపట్టడమే గాకుండా, డిసెంబర్‌ 16, 2019న ప్రచురించిన తాజా ముసాయిదా జాబితాతో సరిపోల్చుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట తాసిల్దార్‌ ఘాన్సీరాం ఉన్నారు.


logo