సోమవారం 30 మార్చి 2020
Wanaparthy - Jan 12, 2020 , 03:54:13

కొనసాగుతున్న డబ్ల్యూపీఎల్‌ క్రికెట్‌ పోటీలు

కొనసాగుతున్న డబ్ల్యూపీఎల్‌ క్రికెట్‌ పోటీలు


వనపర్తి క్రీడలు : జిల్లా కేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా మైదానంలో శనివారం డబ్ల్యూపీఎల్‌ 2020 మ్యాచ్‌లను నిర్వహించినట్లు క్రికెట్‌ కోచ్‌ రాంబాబు తెలిపారు. మొదటి మ్యాచ్‌ వివరాలు  ఎస్‌ఎస్‌ టైటన్స్‌, మెట్రో లైన్స్‌ మ్యాచ్‌ల క్రీడాకారులు పాల్గొన్నారు. టైటన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటీంగ్‌ ఎంచుకున్నారు. అందులో భాగంగా టైటన్స్‌ క్రీడాకారులు 15 ఓవర్లకి 8 వికెట్లు కొలుపొయి 89 పరుగులు చేయగా లైన్స్‌ క్రీడాకారులు 90 పరుగులు చేసి టైటన్స్‌ టీంపై గెలిచారు. రెండో మ్యాచ్‌ విలేజ్‌ విలియన్స్‌, ప్యాతర్స్‌ టీంలు తలబడాయి. ముందుగా ప్యాతర్స్‌ టీం బ్యాటింగ్‌ ఎంచుకొని 61 పరుగులు చేశారు. విలీయన్స్‌ టీం 62 పరుగులు చేసి ప్యాతర్స్‌ టీంపై గెలిచారు. అనంతరం పెబ్బేర్‌కి చెందిన కానిస్టేబుల్‌ రవి పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు.


logo