సోమవారం 30 మార్చి 2020
Wanaparthy - Jan 12, 2020 , 03:53:16

విజయవంతమైన నవోదయ ప్రవేశ పరీక్ష

విజయవంతమైన నవోదయ ప్రవేశ పరీక్ష


వననర్తి విద్యావిభాగం : జిల్లా కేంద్రంలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష వి జయవంతమైంది. నవోదయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశం కోసం శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. 953 మంది విద్యార్థులకు గాను 739 మంది విద్యార్థులు హాజరు కాగా 214 మంది గైర్హాజరైనట్లు జిల్లా పరీక్షల విభాగాధిపతి మధుకర్‌ తెలిపా రు. తెలుగు మాధ్యమంలో 215 మందికి గాను 66 మంది, ఆంగ్ల మాధ్యమంలో 524 మందికి 66, హిందీ మాధ్యమంలో 146కు గాను ఇద్దరు గైర్హాజరైనట్లు ఆయన చెప్పారు. బాలుర ఉన్నత పాఠశాలలో 260, బాలికల ఉన్నత పాఠశాలలో ఏ, బీ కేంద్రాల్లో 490 మందిని కేటాయించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహకులుగా అయ్యపురెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, తారాబాయ్‌, మద్దిలేటిలు వ్యవహరించారని పేర్కొన్నారు.logo