మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Jan 09, 2020 , 19:29:40

నియమావళి ప్రకారంగానే ఎన్నికలు

నియమావళి ప్రకారంగానే ఎన్నికలు

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : ఎన్నికల నియమావళి ప్రకారంగానే ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు, పీడీ సీఏడీఏ కే స్నేహ పేర్కొన్నారు. బుధవారం ఆత్మకూరు, అమరచింతలో మున్సిపల్‌ ఎన్నికలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను, స్ట్రాంగ్‌ రూంలను, కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఆధికారులతో మాట్లాడుతూ అభ్యర్థులకు అందుబాటులో ఉండి ఇబ్బందులు కలగకుండా నామినేషన్లు, తదితర ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సామగ్రి, రిజిస్టర్లు, బ్యాలెట్‌ బాక్స్‌లు తదితర వాటిని పరిశీలించారు. ప్రచారపర్వంలో ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎఫ్‌టీ బృందాలు సమర్థంగా పనిచేయాలని సూచించారు. మద్యం, డబ్బుల పంపిణీ జరగకుండా ఈ బృందాలు నిశితం గా తనిఖీలు చేయాలన్నారు. నామినేషన్‌ పత్రాలను క్షుణంగా పరిశీలించాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌లలో విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశం లేకుండా చూడాలన్నారు. రెండు మున్సిపాలిటీలలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట మున్సిపల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ విజయ్‌భాస్కర్‌, డీటీ నందకిషోర్‌, మున్సిపల్‌ కమిషనర్లు కృష్ణయ్య, మోహన్‌, ఎస్‌ఐ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>