శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 09, 2020 , 19:29:03

నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి

నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి

పెబ్బేరు : నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు అధికారులు కృషి చేయాలని స్నేహ సూచించారు. పెబ్బేరు మండల పరిషత్‌ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాటు చేసిన నాలుగు కౌంటర్లను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు స్నేహ, జిల్లా ఎన్నికల సహాయ అధికారి సంతోష్‌కుమార్‌ నామినేషన్ల కౌంటర్లు, బ్యాలెట్‌ బాక్స్‌, కౌంటింగ్‌ రూంలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్నేహ మాట్లాడుతూ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు క్రియాశీలంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. నోటిఫికేషన్‌ ప్రకారం నామినేషన్‌ స్వీకరణ, పరిశీలన, సింబల్‌ కేటాయింపు, పోలింగ్‌ ఫలితాలు జారీ చేసేవరకు పూర్తి బాధ్యత రిటర్నింగ్‌ అధికారులదేనన్నారు. ఆమె వెంట తా సిల్దార్‌ ఘూన్సీరాం నాయక్‌, డీటీ నందకిషోర్‌, కార్యదర్శి రమేశ్‌నాయక్‌ ఉన్నారు.


logo