గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 09, 2020 , 19:28:51

పశు సంపద వృద్ధికి కృషి చేయాలి

పశు సంపద వృద్ధికి కృషి చేయాలి

వనపర్తి రూరల్‌ : దేశంలోని రాష్టాలలో పశు సంపదను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు రాష్ట్ర సంచాలకుడు పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ వీ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జాతీయ కృతిమ గర్భధారణ కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా ఎన్ని కృతిమ గర్భధారణలు నిర్వహించి, పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేశారో టెక్నిషియన్లను అడిగి తెలుపుకొన్నారు. పశు వైద్య సిబ్బంది, గోపాల మిత్రలు కలిసి వచ్చే 2 నెలలో లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రతి కట్టుదలకు వచ్చే పాడి పశువులకు కృతిమ గర్భధారణ సౌకర్యాలను అందించేలా వైద్యులు, గోపాల మిత్రలు పాడి రైతులకు సహకరించాలని సూచించారు. ఈనెల 16వ తేదీ నుంచి గొర్రెల, మేకల నట్టల నివారణ కార్యక్రమం సజావుగా నిర్వహించుకోవాలని సూచించారు. ఫిబ్రవరిలో ప్రారంభించే గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మాకంగా తీసుకొవాలన్నారు. తగిన టీకా మందులు జిల్లా కేంద్రంలో నిల్వ చేయడానికి కావాల్సిన రిఫ్రిజరేటర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. రైతులకు ప్రభుత్వపరంగా కార్యక్రమాల గురించి, పథకాల గురించి రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. వేసవి దృష్టిలో ఉంచుకొని పశుగ్రాస విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారులు డాక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఈవో డీఎల్‌డీఏ డాక్టర్‌ వెంకటయ్యగౌడ్‌, సీబీవో మధుసూధన్‌గౌడ్‌, జిల్లాలోని పశువైద్యధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


logo