సోమవారం 06 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 09, 2020 , 19:23:46

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

-కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
-5ఎస్‌ విధానాన్ని తప్పకుండా పాటించాలి
-మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి : ఎస్పీ అపూర్వరావు
-డీఎస్పీ, సీఐ కార్యాలయాలు, రూరల్‌ పీఎస్‌ తనిఖీ

వనపర్తి టౌన్‌ : ఫిర్యాదులపై తక్షణమే స్పందించి ఆర్థి క, షీటీమ్స్‌ నేరాల కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ అపూర్వరావు పేరొన్నారు. బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా వనపర్తి డీఎస్పీ, సీఐ కార్యాలయాలు, రూరల్‌ పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేశారు. ముందుగా రూర ల్‌ ఎస్సై షేక్‌ షఫీ, పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది గౌరవవందనాన్ని ఎస్పీ స్వీకరించారు. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో న మోదైన కేసుల వివరాను అడిగి తెలుసుకొని రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రిసెప్షన్‌లో విధులు నిర్వహిస్తున్న మ హిళా కానిస్టేబుల్‌ లక్ష్మీనర్సమ్మను ఫిర్యాదుదారులపట్ల వ్యవహరిస్తున్న తీరు, నిరక్షరాస్యులకు అందజేస్తున్న స హకారం, తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. డయల్‌ 100కు కాల్స్‌ వస్తే వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులకు అండగా నిలవాలన్నారు. పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, స్టేషన్‌ రికార్డులు, ఫైల్స్‌ను క్రమపద్దతిలో ఉపయోగించుకోవడానికి 5 ఎస్‌ విధానాన్ని పాటించి శు భ్రంగా ఉండేలా చూడాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం తో దర్యాప్తు చేయాలని సిబ్బందికి సూచించారు. సీఐ కా ర్యాలయంలో సిబ్బంది శ్రద్ధతో పనిచేస్తున్నారని, రికార్డులను సక్రమంగా నిర్వహిస్తున్నారని, కార్యాలయ ఆవరణలో ఆహ్లాదకరంగా ఉందని ఎస్పీ అన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగేలా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని సీఐ సూ ర్యనాయక్‌కు సూచించారు. మధ్యాహ్నం డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసి ప్రతి రోజు ఎస్సీ, ఎస్టీ కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించి ప్రజలకు అందుబాటులో ఉండి కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ కిరణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.


logo