గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Sep 23, 2020 , 00:57:16

ఇండ్లు కోల్పోయిన వారికి స్థలాలు ఇస్తాం

ఇండ్లు కోల్పోయిన వారికి స్థలాలు ఇస్తాం

 ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌

ధారూరు : రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కెరెళ్లి గ్రామంలో  గ్రామస్తులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయినవారికి రెండున్నర ఎకరాల స్థలంలో ఇంటి స్థలాలు ఇస్తామన్నారు. దీనికి గ్రామస్తులు, నిర్వాసితులు అంగీకరించారని, ఇండ్ల స్థలాలు ఇచ్చే పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, వికారాబాద్‌ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో అమృత, తాసిల్దార్‌ భీమయ్యగౌడ్‌, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, గ్రామ సర్పంచ్‌ నర్సింహారెడ్డి, ధారూరు సీఐ మురళికుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అద్యక్షుడు వేణుగోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.
logo