ఆదివారం 25 అక్టోబర్ 2020
Vikarabad - Sep 24, 2020 , 01:26:46

ప్రగతి దిశగా పల్లెలు

ప్రగతి దిశగా పల్లెలు

జోరందుకున్న అభివృద్ధి పనులు - ధారూరు మండలంలో 7 రైతు వేదికలు 

ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, ప్రకృతి వనం

పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు -  పక్కాగా పారిశుద్ధ్య నిర్వహణ

ధారూరు : మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పల్లెల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘పల్లె ప్రగతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పక్కా ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పనులు చేపట్టారు. అం దుకు అవసరమైన నిధులను ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అందించడంతో పనులు ముమ్మరంగా సాగుతున్లానయి. 

వసతుల కల్పన..

ప్రతి గ్రామంలో వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ధారూరు మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తయింది. అంతారం, కెరెళ్లి, దోర్నాల్‌, మైలారం, మోమిన్‌కలాన్‌, కుమ్మరిపల్లి, గురుదోట్ల, పులిచింతల మడుగుతండా గ్రామాల్లో  కంపోస్టు షెడ్ల నిర్మాణం పూర్తి కాగా, 24 గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్నాయి. వైకుంఠధామాలు మండలంలోని అంతారం, కెరెళ్లి, మోమిన్‌కలాన్‌లో పూర్తి కాగా మిగతా గ్రామాల్లో వేగవంతంగా జరుగుతున్నాయి. పల్లె ప్రకృతి వనం పనులు అన్ని గ్రామాల్లోనూ పురుగోతిలో ఉన్నాయి. 

7 రైతు వేదికలు..

మండలం పరిధిలో మొత్తం 7 రైతు వేదికలు నిర్మిస్తున్నారు. మున్నూర్‌ సోమారం, నాగసముందర్‌, కెరెళ్లి, ధారూరు, గురుదోట్ల, నాగారం, మోమిన్‌కలాన్‌ గ్రామాల్లో రైతువేదికల పనులు ఊపందుకున్నాయి. ఈ పనులను దసరా నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. మండల కేంద్రరంలో రైతు వేదిక నిర్మాణం పూర్తికాగా, కెరెళ్లి, గురుదోట్ల, మున్నూర్‌సోమవారం గ్రామాల్లో తుదిదశకు చేరాయి. రైతు వేదిక పనులను ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 

పారిశుద్ధ్య నిర్వహణ..

ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యే చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం గా ఉంచుకోవాలని, తడి పొడి చెత్తలను వేర్వేరుగా జమ చేయాలని అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.  పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను సమకూర్చడంతో పనులు సాఫీగా సాగుతున్నాయి. ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు కూడా పల్లె ప్రగతి కార్యక్రమంలో పరిష్కారమయ్యాయి. అభివృద్ధిపై ప్రభుత్వ చొరవను ప్రజలు అభినందిస్తున్నారు. 


ముమ్మరంగా పనులు..

అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మండలంలో మొత్తం 32 గ్రామపంచాయతీలు, 14 అనుబంధ గ్రామాలు ఉన్నాయి.  36 గ్రామాల్లో రెవెన్యూ, అటవీశాఖ పరిధిలో పల్లె ప్రకృతి వనాల కోసం స్థలాలను గుర్తించాం. కొన్ని గ్రామాల్లో పనులు ప్రారంభమయ్యాయి. అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి అవకతవకలు జరుగకుండా పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. 

- జి.అమృత ఎంపీడీవో ధారూరు మండలంlogo