కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని సాల్వీడ్లో శ్రావణమాసం చివరి రోజు అమావాస్యను పురస్కరించు కుని హనుమాన్ దేవాలయంలో గ్రామస్తులు హోమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ముగిసిన పాంబండ బ్రహ్మోత్సవాలు..
శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా నిర్వహించిన పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవనంగా నిర్వహించారు. దేవాలయ చైర్మన్ రాములు, ఈవో సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.