వికారాబాద్ : వికారాబాద్ పట్టణం సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వరాలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ నిఖిల ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్ కుమారుడు ప్రతమ్తో కలిసి దేవాలయన్ని సందర్శించారు. కాగా ఆలయ అర్చకులు సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ విశిష్టతను కలెక్టర్కు వివరించారు. ఇంత మంచి ప్రకృతిలో దేవాలయం నిర్మించడం చాలా బాగుందని కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆలయం తరపున కలెక్టర్కు అర్చకులు శివశంకర్, శ్రీకాంత్స్వాములు ఘనంగా సన్మానం చేశారు.