వికారాబాద్ : వచ్చే సంవత్సరం నిర్వహించే బాడీ బిల్డర్ పోటీల పోస్టర్‌ను వికారాబాద్ అడిషనల్ ఎస్పీ ఎం.ఏ.రశీద్ పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వాహకులతో కలిసి శుక్రవారం విడుదల చేశారు. 2022 ఫ్రివరి 14న వికారాబాద్ క్లబ్లో బాడీ బిల్డర్స్ పోటీలు సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేయడం జరుగుతుదని నిర్వాహకులు పిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ టి. ఆనంద్ తెలిపారు. ది లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోటీలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ. 20వేలు, రెండో బహుమతి రూ. 15వేలు, మూడవ బహుమతి రూ. 10వేలు అందించడం జరుగుతుందన్నారు.
ఎంట్రీ ఫీజు ఏమి లేదని, 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు. సంప్రదించాల్సిన ఫోన్ నం. 917674816956 నంబర్‌కు ఫోన్ చేయలన్నారు. వీరితో పాటు అరుణ్, వసిమ్, ఈశ్వర్, సద్దాం, మీర్జా ఫిరాజ్ భేగ్ ఉన్నారు.