e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిల్లాలు అనుమతి లేకుంటే.. వాహనాలు సీజ్‌

అనుమతి లేకుంటే.. వాహనాలు సీజ్‌

అనుమతి లేకుంటే.. వాహనాలు సీజ్‌

లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం
తాండూరు రూరల్‌ పరిధిలో 4 కార్లు,6 ఆటోలు, 33 ద్విచక్రవాహనాలు సీజ్‌
ఫేక్‌ పాసులు, డూప్లికేట్‌ పేషెంట్లతో ప్రయాణాలు కొనసాగించరాదు
వారంతపు సంతకు నూతన స్థలాన్ని పరిశీలించిన సీఐ జలెందర్‌రెడ్డి

పెద్దేముల్‌, మే 22 : లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తామని తాండూరు రూరల్‌ సీఐ జలెందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో లాక్‌డౌన్‌ పరిస్థితులను పర్యవేక్షించి, వారంతపు సంతకు అనువైన స్థలాన్ని సొసైటీ చైర్మన్‌ ద్యావరి విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్సై చంద్రశేఖర్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తాండూరు రూరల్‌ పరిధిలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. 4 కార్లు, 6 ఆటోలు, 33 ద్విచక్రవాహనాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఫేక్‌ పాసులు, డూప్లికేట్‌ పేషెంట్‌లతో ప్రయాణాలు చేయవద్దని, లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఉన్నత పాఠశాల మైదానంలో వారంతపు సంత
మండల కేంద్రంలో జరుగుతున్న వారంతపు సంత నిర్వహణకు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానాన్ని తాండూరు రూరల్‌ సీఐ పరిశీలించారు. హనుమాన్‌ దేవాలయ ఆవరణలో ప్రతి మంగళవారం వారంతపు సంత నిర్వహిస్తుండగా, కరోనా నేపథ్యంలో పాఠశాల మైదానంలోకి మార్చాలని సొసైటీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, పంచాయతీ సిబ్బందికి సూచించారు. సీఐ వెంట ఎస్సై చంద్రశేఖర్‌, ఏఎస్సైలు షాహిద్‌పాషా, ఆనంద్‌కుమార్‌, పోలీసు సిబ్బంది శ్రీనివాస్‌, సాయిరామకృష్ణ, కారోబార్‌ నర్సిరెడ్డి ఉన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
యాలాల, మే 22: పకడ్బందీగా వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్సై సురేష్‌ అన్నారు. లక్ష్మీనారాయణపూర్‌ చౌరస్తాలో వాహనదారులకు నిబంధనలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.ఆయన వెంట హెడ్‌ కానిస్టేబుల్‌ దస్తప్ప, శ్రీను, జెయప్ప, బలరామ్‌, నరేశ్‌ పాల్గొన్నారు.
కరోనా కట్టడికి సహకరించాలి
దోమ, మే 22 : నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ కరోనా కట్టడికి గ్రామాల్లోని ప్రజలు సహకరించాలని ఎస్సై రాజు అన్నారు. దోమ మండల పరిధిలోని దాదాపూర్‌ గ్రామంలో కూరగాయల మార్కెట్‌(సంత)ను పర్యవేక్షించారు. భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుని కూరగాయలు అమ్మే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆయన వెంట ఆర్‌ రాములు, చందర్‌, నర్సింహులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
కులకచర్లలో..
కులకచర్ల, మే 22 : మండలంలో కులకచర్ల ఎస్సై విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో అనవసరంగా బయటకు వస్తున్న వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సై వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.

డ్రోన్లతో ప్రత్యేక నిఘా
పరిగి, మే 22 : పరిగిలో సడలింపు సమయంలో కూరగాయల కొనుగోలు వద్ద ఇబ్బందులు కలుగకుండా మున్సిపల్‌ అధికారులతోపాటు పోలీసులు భౌతికదూరం పాటిస్తూ కూరగాయలు కొనుగోలు చేసేలా అవసరమైన చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్‌ సందర్భంగా పరిగిలో సీఐ లక్ష్మీరెడ్డి, ఎస్సై క్రాంతికుమార్‌ వాహనాల తనిఖీ చేపట్టారు. డ్రోన్ల సహాయంతో మరింత నిఘాను ఏర్పాటు చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అనుమతి లేకుంటే.. వాహనాలు సీజ్‌

ట్రెండింగ్‌

Advertisement