e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home వికారాబాద్ ఊరికో ట్రాక్టర్‌..పనులకు బేఫికర్‌

ఊరికో ట్రాక్టర్‌..పనులకు బేఫికర్‌

  • ఎన్నో పనులు సులభం
  • మొక్కలకు నీరు, చెత్తసేకరణ
  • ప్రభుత్వ ప్రోత్సాహంతో సత్ఫలితాలు

యాచారం, మార్చి17: పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తొంది. గ్రామాలను అభివృద్ధికి నమూనాగా మార్చేందుకు విన్నూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా గ్రామాలను స్వచ్ఛతకు చిరు నామాగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్య క్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. పల్లెప్రగతితో అనేక అభివృద్ధి పథకాలను చేపట్టి నూతన ఒరవడికి నాంది పలికారు. ఫలితంగా గ్రామాలు అనేక రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగ స్వాములై పల్లెప్రగతి ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహంతో గ్రామాల రూపురేఖలను ఒక్కసారిగా మార్చేశారు. ఏడాదిన్నరగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాలలో విజయవంతంగా కొనసాగుతున్నది. పల్లె ప్రగతి ద్వారా నిర్విరామంగా కొనసాగుతున్న పనులతో పల్లెలు స్వచ్ఛగా మారాయి. ముఖ్యంగా చెత్తసేకరించడం, ముళ్లపొదలను తొలగించడం, మొక్కలకు నీరందించడం కోసం పంచాయతీలకు ట్రాక్టర్‌లను అందజేశారు. ట్రాక్టర్‌ల కొనుగోలు కోసం కేంద్ర, రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులను ఉపయోగించారు. దీంతో గ్రామ పంచాయతీలకు సొంతంగా వాహ నాలు స మకూరాయి. మండలం లో ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ ఓ ఆస్తిగా మిగిలిపోయింది.
పంచాయతీకో ట్రాక్టర్‌..
మండలంలో 24 గ్రామ పంచా యతీలున్నాయి. ఇందులో నాలు గు గ్రామ పంచాయతీలు నూత నంగా ఏర్పడ్డాయి. పల్లెప్రగతి ద్వారా ప్రభుత్వం ప్రతి పంచాయ తీకొక ట్రాక్టర్‌ను అందజేయడం తో మండలంలో మొత్తం 24 నూతన ట్రాక్టర్‌లు ఉన్నాయి. వీటి కి ట్రా లీలు, ట్యాంకర్‌లున్నా యి. 24 ట్రాక్టర్‌లలో 23 ట్రాక్టర్‌ లు గ్రామ పంచాయతీలు సమకూర్చు కోగా నందివనపర్తి గ్రామ పంచాయతీకి మాత్రం అదే గ్రామానికి చెందిన బీఎన్‌రెడ్డి ట్రస్టు చైర్మన్‌ బిలకంటి శేఖర్‌రెడ్డి సుమారు రూ.7లక్షలతో నూతన ట్రాక్టర్‌, ట్యాంకర్‌ను ఉచితంగా అందజే శారు. ట్రాక్టర్‌ కొనుగోలు పక్రియ గ్రామపంచా యతీలకు భారం కాకూడదని పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధులను లెక్క గట్టి ట్రాక్టర్‌ విలువలో సమారు 40శాతం సొమ్ము చెల్లించడం, 60 శాతం బ్యాంకుల నుంచి రుణం పొందేలా చర్యలు తీసుకున్నారు. కొన్ని పంచా యతీలు రుణ సదుపాయం లేకుండానే ట్రాక్టర్‌లను పొందాయి. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌తో పాటుగా ట్రాలీ, ట్యాంకర్‌ లు అందుబాటులో ఉన్నాయి. ఇవి గ్రామావసరాలకు ఎన్నో విధా లుగా ఉపయోగపడుతున్నాయి.
ఒక్క ట్రాక్టర్‌…ఎన్నో పనులు
గ్రామపంచాయతీలు ట్రాక్టర్‌లను సమకూర్చుకోవడంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. గత ఏడాదిన్నర క్రితం ఎక్కడి చెత్త అక్కడే ఉండేది. చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన చెత్త రిక్షాలు మూన్నాళ్లకే మూలకు పడేవి. వాటితో చెత్త సేకరణ ఇబ్బందిగా ఉండేది. దీంతో సిబ్బంది సైతం తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేవారుకాదు. మొక్కలకు నీరు సక్రమంగా పోయక అవి అనతి కాలంలోనే ఎండిపోయేవి. కానీ ప్రస్తుతం సీన్‌ ఒక్క సారిగా మారిపోయింది. పల్లె ప్రగతి అమలులోకి వచ్చాక పంచాయతీలకు ప్రభుత్వం ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ను అందజేయడంతో అనేక సమస్యలకు చెక్‌పడింది. ఒక్క ట్రాక్టర్‌ అనేక రకాల పనులను చేయడంతో గ్రామ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. తడి, పొడి చెత్తను సేకరించి కంపోస్టుయార్డు, డంపింగ్‌యార్డులకు ట్రాలీ ద్వారా తరలిస్తున్నారు. మొక్కలకు నిత్యం నీరందిస్తున్నారు. పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను తొలగించడంతో గ్రామాలు శుభ్రంగా మారుతున్నాయి. దీంతో గ్రామాలు స్వచ్ఛతకు మారు పేరుగా నిలవడంతో పాటుగా, పంచాయతీ సిబ్బంది పనులు మ రింత సులభంగా మారాయి. ట్రాక్టర్‌ ద్వారా పంచాయతీ పరిధిలో కొంత మందికి ఉపాధి లభిస్తొంది. డ్రైవర్‌, పారిశుద్ధ్య కార్మికులను నియమించుకునే సౌలభ్యం కలిగింది.
స్వచ్ఛ కార్యక్రమాలలో కీలకం
గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌లు సమకూర్చడంతో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. ట్రాక్టర్‌ ద్వారా చెత్త సేకరణ, హరితహారం, పల్లెపకృతి, నర్సరీ మొక్కలకు నీళ్లు పో యడం, ముళ్ల పొదలను తొలగిండటం సులువుగా మారింది. ప్రజలకు మేలు చేసే ఏ అవసరానికైనా ట్రాక్టర్‌ను వినియోగిస్తున్నాం. మనుషులు చేయలేని అనేక పను లు గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాం కర్‌లతో సాధ్యమవుతుంది. ట్రాక్టర్‌తో పంచాయతీలకు ఎంతో మేలు జరిగింది.

  • శ్రీధర్‌రెడ్డి సర్పంచ్‌, యాచారం
    ఎన్నో ప్రయోజనాలు
    గ్రామాలలో ట్రాక్టర్‌ల ఏ ర్పాటుతో ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పం చాయతీ సిబ్బంది విధి నిర్వాహణ సులభతరమైంది. ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌లతో పంచాయతీలకు ఎంతో మేలు జరిగింది. ఎన్నో విధాలు గా గ్రామావసరాలకు ట్రాక్టర్‌ ఉపయోగపడుతుంది. ట్రాక్టర్‌లు వచ్చాక గ్రా మాల రూపురేఖలు మారిపోయాయి. ట్రాక్టర్‌ల నిర్వాహణను అధికారులు సక్రమంగా చూసుకోవాలి. గ్రామావసరాలకు పంచాయ తీ ట్రాక్టర్‌లను సద్వినియోగం చేసుకోవాలి.
  • మమతాభాయి ఎంపీడీవో, యాచారం
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement