పరిగి, ఏప్రిల్ 11 : బడుగు, బలహీనవర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు పూలే అని మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కె.అరవిందరావు అన్నారు. ఈ సందర్భంగా పరిగిలోని జ్యోతిరావుఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌కుమార్, కౌన్సిలర్లు వేముల కిరణ్, ఎదిరె కృష్ణ, వారాల రవీంద్ర, వెంకటేశ్, వివిధ ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు.
తాండూరు నియోజకవర్గంలో..
తాండూరు, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని తాండూరు నియోజకవర్గంలో నిర్వహించారు. రాజకీయపార్టీల నేతలు, కుల సంఘాల ప్రతినిధులు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం తాండూరు నియోజకవర్గం కన్వీనర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలోని కులమతాల వివక్షత, అన్యాయాలను రూపుమాపడానికి కృషి చేశారని పేర్కొన్నారు. ఫూలే తన భార్య సావిత్రిబాయితో కలిసి భారతదేశంలో స్త్రీ విద్యకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తూ మహిళల చదువు, హక్కులకోసం నిరంతరం పోరాటం చేశారని అన్నారు.
స్ఫూర్తిదాయకుడు ఫూలే
యాలాల, ఏప్రిల్ 11 : జ్యోతిరావు ఫూలే స్ఫూర్తిదాయకుడని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉప్పలి మల్కయ్య అన్నారు. మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్పతో కలిసి ఫూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి నివాళులర్పించి మాట్లాడారు.
ఆశయ సాధనకు కృషి చేయాలి
పెద్దేముల్, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనకు కృషి చేయాలని ఎంపీపీ టి.అనురాధరమేశ్ అన్నారు. మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావుఫూలే బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో సర్పంచ్ శ్రావణ్, ఎంపీటీసీ శ్రీనివాస్‌లతో కలిసి ఫూలే జయంతిని నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ఫూలే అని కొనియాడారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ప్రకాశ్ కోయెల్కార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, టి.రమేశ్, రాంగోపాల్, కె.వెంకటయ్య పాల్గొన్నారు.
కులకచర్ల, చౌడాపూర్ గ్రామాల్లో..
కులకచర్ల, ఏప్రిల్ 11 : కులకచర్ల మండల పరిధిలోని కులకచర్ల, చౌడాపూర్ గ్రామాల్లో జ్యోతిరావు ఫూలే జయంతిని వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కులకచర్ల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, ఎస్సై విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ ఆనందం, మాజీ డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఇన్చార్జి ఎంపీవో శ్రీనివాస్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు మైపాల్, కృష్ణగౌడ్, గాంగ్యానాయక్, గోపాల్‌నాయక్, వెంకటయ్యగౌడ్, రాఘవేందర్‌గౌడ్, స్వేరోస్ సర్కిల్, అంబేద్కర్ యువజన సంఘాల సలహాదారుడు నర్సింహులు, వెంకట్రాములు, రామచందర్, రాములు పాల్గొన్నారు. చౌడాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేశ్, అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి
తాండూరు రూరల్, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిరావు ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని తాండూరు జడ్పీటీసీ గౌడి మంజూల అన్నారు. మండలంలోని చెంగోల్ గ్రామంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫూలే జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వెంకటేశం, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, ఉపసర్పంచ్ లక్ష్మణ్, ఉపాధ్యాయులు రామచందర్, రమేశ్, సురేశ్, ప్రవీణ్, ఏసు, శ్రీకాంత్, బాలు, అనిల్, చెన్నప్ప, అంబేద్కర్, వివేకానంద యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
చిట్టంపల్లిలో..
పూడూరు, ఏప్రిల్ 11 : మండలం పరిధిలోని అంగడి చిట్టంపల్లి గ్రామంలోని జ్యోతిరావుఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, మాజీ సర్పంచ్ నవీన్, సొసైటీ డైరెక్టర్ చెన్నయ్యగౌడ్, పూడూరు ఉప సర్పంచ్ రాజేందర్, నాయకులు బి.విఠలయ్య, కె.మురళి, కె.ప్రవీణ్, జి.రాజేందర్‌గౌడ్, భద్రేశ్ పాల్గొన్నారు.
నవల్గా గ్రామంలో..
బషీరాబాద్, ఏప్రిల్ 11 : మండల పరిధిలోని నవల్గా గ్రామంలో జ్యోతిరావు ఫూలే జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కలాల్ నర్సింహులుగౌడ్ హాజరై మాట్లాడారు. అణగారిన వర్గాల విద్యాభివృద్ధి ఫూలే ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాలప్ప, గ్రామస్తులు అనికుమార్గౌడ్, రాఘవేందర్, లక్ష్మప్ప, శ్రీశైలం, రాజు, నాగేందర్, పురశురామ్గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
ఆర్టీసీ ఉద్యోగులకు అండగా ప్రభుత్వం..