e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home వికారాబాద్ పెండింగ్‌ పనులు పూర్తి చేయండి

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి

వికారాబాద్‌, మే 7, (నమస్తే తెలంగాణ): పెండింగ్‌ పనులను వేగంగా పూర్తి చేయాలని వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పట్నం సునీతారెడ్డి అన్నారు. కొవిడ్‌ బారిన పడి కోలుకున్న తర్వాత శుక్రవారం జడ్పీ కార్యాలయంలో పంచాయతీరాజ్‌ ఇంజినీర్లతో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న జడ్పీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను ఇప్పటికే రద్దు చేశామని చెప్పిన చైర్‌ పర్సన్‌ అగ్రిమెంట్‌ కానీ పనులను కూడా రద్దు చేస్తామని చెప్పారు. అగ్రిమెంట్‌ అయిన పనులను వెంటనే పూర్తి చేసేలా ఏఈలు శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ సమీక్షలో జడ్పీ సీఈవో జానకీరెడ్డి, పీఆర్‌ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ బాబు శ్రీనివాస్‌, డీఈలు పాల్గొన్నారు.

మండల అభివృద్ధికి కృషి చేస్తా
మండల అభివృద్ధికి కృషి చేస్తానని జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంకును ఆమె ప్రారంభించారు. అనంతరం శివాలయంలో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి జడ్పీ నిధులను త్వరలో మంజూరు చేస్తానని చెప్పారు. మాలసోమారం మీదుగా వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుకు రెండు బ్రిడ్జిల అవసరమని, వాటి నిర్మాణాన్ని త్వరగా చేయాలని స్థానిక నాయకులు కోరారు. నిర్మాణ పనులు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లావణ్యశ్రీనివాస్‌, ఎంపీపీ ప్రభాకర్‌, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు నర్సింహులు, జడ్పీటీసీ సంతోష, సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెండింగ్‌ పనులు పూర్తి చేయండి

ట్రెండింగ్‌

Advertisement