శుక్రవారం 30 అక్టోబర్ 2020
Vikarabad - Sep 26, 2020 , 01:08:19

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

పరిగి: సమాజంలో అత్యంత గౌరవప్రదమైనది ఉపాధ్యాయ వృత్తి అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగిలోని మండల పరిషత్‌ కార్యాలయంలో మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో గురువులది ప్రధాన పాత్ర అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, మున్సిపల్‌  చైర్మన్‌ ముకుంద అశోక్‌, జెడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు హఫీజ్‌, ఎంఈవో హరిశ్చందర్‌, పాఠశాలల ప్రధానోపాధ్యాయలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.